పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

99


లేదు. ద్వారమునుండి దేవిడీ లోపలి భాగము మిలిటరీ వారు వశపరచు గొనినారు. విధి లేక రెడ్డి గారు బయటనే ఆగిపోయి నారు. శ్రీ యువ రాజు గారు దేవిడీలో ప్రవేశించినారు. దేవిడీలో ఎన్నియోబంగ్లాలు కలవు, విందుకై ఏర్పాటు చేసిన బంగ్లాయేదిమో యేమో. ఒక బంగ్లాయెద్ద మోటారుచేరినది. అక్కడ శ్రీ నిజాం ప్రభువు గారు లేరు. ఆహ్వానించు వారును లేరు. యువరాజు గారికిని వారి కమాండరుగాకిని ఆగ్రహము కలిగినది. పావుగంట వరకు వేచు కొని నారు. తుదకు నిజాం ప్రభువుగారికి తెలిసినది. అందరును కొత్వాలు గారిపై యెగిరిపడినారు. “ నేను మిలిటరీ వారిని ప్రాధేయపడినను లోనికి రానీయకపోయిరి. మరి తాము సరియగు వ్యవస్థ చేయక పోయితిరి. నా దేమియు తప్పులేదు.. అని రెడ్డి గారు తెలుపుకొనినారు.

మరునాడు వేరొకచోటవిందు. ఆందులో శ్రీ నిజాము ప్రభువుగారు రెడ్డి గారిని ప్రత్యేకముగా పిలిచియిట్లు చెప్పినారు. " ఇదిగో, రేపు మరల మా దేవిడిలో విందు ఏర్పాటు చేసినాము. ఎవ రేవన్ననుసరే నీవు నేరుగా మా బంగ్లాకు రానలసినది. నీవు లేనిది మరల పొరపాటులు జరుగును . “చిత్తము" అని రెడ్డిగారు అదే ప్రకార మాచరించుకొని ఆంతయు సవ్యముగా జరుగులాగున చూచుకొన్నారు.