పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98


యువరాజు గారు నచ్చుటకు ( దినాలకు ముందుగా సిమ్లాలోనుండిస సి. ఐ. డీ. పోలీసు డిపుటీ డైరెక్టర్ జనరల్ గారు హైద్రాబాదుకు వచ్చి కొత్వాలు గారి ఏర్పాట్లన్నియు సూక్ష్మముగా విచారించి చూచినారు. నగరమంతయు తిరిగి నారు. ముఖ్యముగా పాడు గోడలను పరిక్షించినారు. ఆ గోడలు దాపుని ఒకరిద్దరు ప్రతి చోటను కనబడినారు. సి. ఐ. డీ అధకారి వారి విషయమై విచారించినారు. కొత్వాలుగారు సీటీ యియ్యగానే ఆగోడల లోపలివారు వచ్చినారు. వీరు మాచారులే అని చూపించినారు. సీ. ఐ. డీ. అధికారీకి సంపూర్ణముగా తృప్తి కలిగినది. యువ రాజు గారు వచ్చిన నాడు వీదులలో సుమారు 3 - 4 లక్షల మంది కనబడినారు. సి ఐ. డీ. అధికారి కొత్యాలు గారి మోబారులోనే యుండినారు. జన సమ్మర్గమునుచూచి భయపడిపోయినారు. “ఏమియు భయ పడవలసిన పని లేదు. అంతయు నాదే బాధ్యత " అని కొత్యాలుగారు నిర్భయముగా చెప్పినారు.యువ రాజుగారు ఐదు దినములు నగరములో అతిథిగా నుండినారు. మరునాడు శ్రీ నిజాం ప్రభువు గారి వద్ద విందు. కొత్యాలుగారు యువరాజుకన్న ముందుగా దేవుడికి వెళ్లినారు. దేవిడీ ద్వారము వద్దనే మిలిటరీవారు వారి నాపినారు. " నేను కొత్యాలును నన్ను వదలుడు" ఆని తెలుపుకొనినను వదల