పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

97


దినాలకు రానున్నారనగా పూర్వపు జిల్లా పోలీసు డైరెక్టరైనట్టి హెంకిను గారినికూడ పిలిపించి యువ రాజు గారి బంగ్లా సంరక్షణ కర్తగా నియోగించినారు. హెంకీనుగారు రెడ్డి గారు చేసిన ఏర్పాట్లన్నియు విమర్శనతో చూచి అన్నియు తెలిసి కొనిన తర్వాత ఇట్లన్నారు. " నా శిష్యులలో నీ వొక్కడవే నిజమైన శిష్యుడవు. ఇంతకన్న మించిన ఏర్పాటులు నేను కూడ చేయవలసినది లేదు. అయితే ఒక్కమాట. ఇంత కట్టు దిట్టములు చేసిన తర్వాత తీరా యువరాజుగారు వచ్చునాడు వీధులు నిర్మానుష్యముగా నుండిన అదియు వికారముగాను విపరీతముగాను కావింపబడునుగదా. దాని కేమి యాలోచించితివి.” రెడ్డి గారు యువ రాజు గారి ఆగమనమున గొక దినము ముందు నగరమంతటను దండోరా వేయించినారు. యువరాజు గారి వేడుకలు చూడ గోరు వారందరును ప్రొద్దుననే ఎనిమిది గంటలలోగా వచ్చి శాంతము - వీధులలో బాటప్రక్కన కూర్చున వచ్చునని చాటింపు చేయించినారు. తునకు యువ రాజు గారు రానేవచ్చిరి- వీధులలో జనులు 'కిక్కిరిసినారు. నాలుగు గుర్రాల బర్లీలో తిన్నగా నెమ్మదిగా ఊరేగింపు చేసినారు. ఫలక్నుమా సౌధములో చేరుకున్నారు. అంతయు శుభావహముగానే జరిగినది. 13