పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రస్తావన


రాజాబహద్దరు వేంకట రామారెడ్డిగారి జీవితచారిత్రము ఆంధ్రభాషలోఁ బ్రకటితము లయిన, మనోహరమైనట్టియు, ఉపదేశాత్మక మైనట్టియు జీవిత చారిత్రములలో నొక్కటియై యున్నది. ఇది ఆకర్షణీయమైన శైలిలో హైదరాబాదు నగర పౌరావతంసులగు నొక్కరినిగూర్చి ప్రకాశమానమగు వర్ణనము. వీరు ఆంధ్ర దేశమునం దంతటను, ముఖ్యముగా, విశాలమగు సుప్రసిద్ధ రెడ్డి సంఘీయులచేత నెక్కువగను, అత్యంత గౌరవ పురస్పరముగ భావింపబడు చున్నారు. ఆంధ్రవచన రచనా ధురీణునిచే సమర్చితమైన యీ యుత్తమ చారిత్రమును విమర్శింప వలసిన యవసరము లేదు. అందుకు బదులుగా, మహిమోన్నతులను రాజాబహద్దరు వారితో నాకుగల వ్యక్తి సంబంధములను గూర్చియు, శ్రీవారినిగూర్చి నా మానసముపై ముద్రితమైన భావములను గూర్చియు కొంత నుడివి, యీ కథాంశమును పూర్ణము గావించుటయే నేను చేయవలసిన కార్యమయి యున్నది.