పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90


నము వారిలో లేకపోలేదు. ఇట్టి సన్నివేశములలో ఇట్టి అగ్ని పరిక్షలకు లోనై అందు 'విజయమును పొంది మ. ఘ. వ. నిజాం ప్రభువు గారిని మొదలుకొని, పోలీసు సీపాయివరకును, మోటారు నెక్కు రాజులను మొదలుకొని, మోట కొట్టు రైతు వరకును, అందరును ప్రశంసించునట్లుగా వేంకట రామారెడ్డి గారు వర్తించుకొనినారు. హిందూ ముసల్మానులు సమానముగా ఒక అధికారిని ప్రేమించుట ఈ రాష్ట్రములో అరుదై నట్టియు, విచిత్ర మైనట్టియు నంశము. అట్టి సమాన ప్రేమకు పాత్రు లైన వారీ వేంకట రామా రెడ్డి గారొక్కరే కాన వచ్చుచున్నారు.


వీరు కొత్యాలు పదవికి వచ్చిన కొలది కాలములోనే పోలీసు శాఖలో అనేకము లైన మార్పులు కావించిరి. పూర్వ పద్దతిని వదలి వేసి క్రొత్త పద్ధతిపై చేతిక్రింది యుద్యో గులను సిద్ధముచేసిరి. వీరిలో నింకొక్క విశేషమున్నది. ప్రతిచిన్న విషయమనుగూడ తాము స్వయముగా విచారించుకొని తృప్తి పడిన పిమ్మటనే క్రింది అధికారులకు చర్య గైకొనుటకై అనుజ్ఞ యిచ్చెడివారు. ఈ కారణముచేత వారికి నిరంతరము పనియే యుండిన దన్నమాట. సగము రాత్రి వేళ కూడ నగరములో ఏదైన' దౌర్జన్యములు కలిగిన క్రింది అధికారులు వారిని లేపి స్వయముగా తెలుపుచుండిరి. లేదా టెలిపోనుద్వారా వారి