పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

89


రాజకీయపు సంబంధమగు ఖిలాఫత్ ఆందోళనము, ఇంకొక పక్క బ్రిటిషిండియాలోని సత్యాగ్రహపు గాలి వీచుచుండుట తటస్థించెను. నవాబులు, రాజులు, తమ ప్రాచీనాధి కారములను వదలు వారు కారు. వారేమైన అక్రమములు చేసినను వారిపై ఆధి కారము పూర్ణముగా చూపించిన వారు ప్రబల శత్రువుల గుదురు, ప్రజాందోళసమును అణచిన అషయశస్సును పొందుదురు. అల్లరులు జరిగినప్పుడు సమయము కని పెట్టి కొని యుండినట్టి సరిషడని వారికి ప్రభుత్వము వద్ద విరుద్ధ ప్రచారము చేయుట కవకాశము లబించును. ఇవన్నియు నిట్లుండ నగరములో ఒక జాతివారు, ఒక దేశము వారు, ఒక మతము వారు ఆను పరిమితి లేకుండెను.నడుము చుట్టును బాకులు, కత్తులు, మెడలపై తుపాకులు వేసుకొని తిరుగు అరబ్బులును, బీదల పాలిటి భయఁకరులై పీడకులని వ్యక్తి పరచచిసిన రోహి లాలను, పఠానులును, చెల రేగిన పట్టశక్యముగాని సిక్కులును, ఇట్టివే యితర జాతుల వారసు నగరమందు బహుళముగా నుండిరి, (ఇప్పటికిని కలరు.)


ఈ పరిస్థితులలో వేంకట రామారెడ్డిగారి ఉద్యోగము అసిధారా వ్రతము వంటిదై పోయెను. ఏ క్షణమున ఏమి పొరపాటు జరుగునో ఉయేమో తెలుగు యజ మానికి అసం తృప్తి కలుగునో, ఏమి ఆగ్రహము కలుగునో అను ఆందోళ