పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82


విచారణ లేకుండ మూసియుంచుచుండిరి. ఈకొత్వాలీ యుద్యోగము గ్రామ కరణీకమువలె వంశ పారంపర్యముగా వచ్చు ఉద్యోగముగా భావింపబడు చుండెను. గాలీబుద్దౌలా చని పోయినప్పుడు అతని కుమారుడు రెండేండ్ల వాడు. ఆ పిల్లవాని పేర కొత్వాలీ పదవిని స్థిరపరచి అతనికి బదులుగా నొక సహాయ కొత్వాలును నియమించి పని తీసికొనిరి.


కొత్వాలీ పదవి నలంకరించిన వారిలో నవాబ్ జోరా వర్ జంగ్ అనువారు కూడ చాల ప్రసిద్ధులు. వారు జనుల ముఖములను చూచియే దొంగ లెవరో దొర లెవలో గుర్తించెడి వారట! వారు అరుదుగా నగరములో సవారీ వెళ్లుచండెడి వారు. ఎప్పుడైన వాహ్యాళి వెళ్ళినప్పుడు వారు గుర్రము పై నెక్కి ముందు వెనుకల అరబ్బులు, రోహిలాలు, పోలీసు జవానులు నడుచుచుండగా నగర వీధులలో తిన్నగా గంబీరముగా వెళ్లుచుండెడి వారు. జవానులకు డ్రెస్సులు లేకుండెను. కొందరకు లాగులు, కోందరకు ధోవతులు, కొందరకు తెల్లని అంగీలు, అందరికిని నడుములో తోలుపట్టీలు, చేతులలో కట్టెలును ఉండు చుండెను. కొత్వాలుగారు సవారీ వెళ్ళినప్పుడు వీధులలో ఉభయ పార్శ్వములందు జనులు క్రిక్కిరిసి నిలుచుకొనియుండెడి వారు. కొత్వాలుగారు ఆదిక్కు ఈదిక్కు జనులను తేరిపార చూచుచు అందందు గుర్రమునాపి తస జవా