పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

నగర కొత్వాలు

హైద్రాబాదు నగరకొత్వాలు పదవిలో ఆదినుండియు నేటివరకు ముసల్మానులే అందును విశేషముగా సున్నీ తెగ వారే నియమితులగు చుండిరి. రెడ్డిగారే ప్రప్రథమ హిందువు లీ పదవి నలంకరించుటకు! ఈ సందర్భములో కొత్వాలీ చరిత్ర కొంత తెలిసికొనట వినోద కరముగా నుండును.

సర్ సాలార్జంగుగారి కాలములో “జిల్లాబందీ" పద్దతి యేర్పడెను. అంతకు పూర్వము నగరములో 18 మంది గొత్వాలులు పని చేసియుండిరి. వారిని "అఠారాకొత్వాల్ " అని యందురు. వీరిలో తాలిబు ద్దౌలా, గాలిబుద్దౌలా అను నిద్దరన్నదమ్ములు ప్రసిద్ధులైన వారు. వారి క్రింద 600 పోలీసు సిబ్బంది మాత్రమేయుండెను. వారి కాలములో పోలీసు వారి అధికారములకు పరిమితి లేకుండెను. ఎవరిపై కన్ను బడిన వారిని పట్టుకొనుచుండిరి. ఎంత కాలము వరకై నను వారిని జెయిలులో