పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన యోగసిద్ధి-మత ప్రచారము 91

(6) కోపము విడువవలెను. (7) ఈశ్వరారాధన మెల్లప్పడును జేయుచుండవలెను. క్రైస్తవులకు 10 ఆజ్ఞ లెట్టివో యీ సంప్రదాయమువారి కీ సప్తాజ్ఞ లట్టివి."*[1]

వేమనయొక్క పై మతము నాశ్రయించిన వారి నెవరిని గాని నేనుజూడ వీలుకలుగలేదు. ఇదే సత్యమైన యెడల, వేమన, సామాన్యజనులకు తత్వ విచారణ యందరాని పండని గుర్తించి, ఈశ్వరుఁడొక్కఁడు కలఁడని మాత్రము తెలిపి, ఆతని నెఱుఁగుటకును, పరోపకారమునకును, తమ మనసు నెమ్మదికిని పనికివచ్చు పై నియమములను మాత్రము నిత్యముగా నాచరింపఁడని సర్వమత సారమును శిష్యుల కుపదేశించినట్లు కానవచ్చుచున్నది. ఇతని శిష్యపరంపరవారు, ఈ మతము నెంతవఱకు ఆచరణలో నిలుపుకొన్నారో యెఱుఁగను, కటార్లపల్లె తుంగ వేమన్న మతమును ఇదియే యైనను, అతని పరంపరవారతనికి ఉత్సవములు పూజలు చేయువేళ గొఱ్ఱెల యెనుబోతుల రక్తప్రవాహములతో అర్ఘ్యపాద్యము లిచ్చుచున్నారు ! శిష్యులు గురువునకు విరోధముగానే వర్తించుట సృష్టియందలి రహస్యములలో నొకటి. అట్లు గాకుండుట సంభవించునేని, ప్రపంచమునకెల్ల, ఎల్లకాలమునకు, ఒక్కగురువు చాలునుగదా. కావున ఇతర మహాపురుషుల మతము లన్నియు శిష్యులలో నేయవస్థకు వచ్చినవో యంతకన్న ముచిస్థితిలో వేమన్న మతమువారు నేఁడుండిరేని యది వరమాశ్చర్యమగు విషయమే యగును.

వేమన్న తన యవసానకాలము నెక్కఁడగడపెనను విషయము యథాప్రకా రము సందిగ్ధమే. పామూరివద్ద కొండగుహలో ప్రవేశించి మరల బైటికి రాలేదను వాడుకను మొదలే చెప్పితిని గదా? అంతకంటె బలవంతమైన సాక్ష్యము లభించు వఱకు నదియే నమ్మదము. శ్రీ శంకరాచార్యులు ఇట్లే కడపట గుహాప్రవేశము చేసిరని వాడుక, ప్రపంచవ్యవహారమును చేతనైనంత నడిపి యఖండ బ్రహ్మాను భవానందమును జెందుటకై యోగులిట్లు చేయుదురు. కొందఅు శిష్యానుగ్రహార్థము ఎదో యొకచోట సజీవ సమాధిలో 'గోరీ" చేసికొందురు. తుంగవేమన్నది యిట్టి సమాధియే యని వెనుకఁ జెప్పతిని. ఇప్పటికిని వారు సజీపులై ముక్తిసుఖము ననుభవించుచున్నారనియే జనులు నమ్ముదురు.

వేమన్నయు నట్లే సుఖముగా నెందైన శాశ్వతముగా నుండనిండు ! ప్రపం చము వలన ప్రంచమునకై యతఁడు పడిన కష్టములకు అంతమాత్రము నెమ్మది యైనను అతనికి గోరుట మనధర్మము !

  1. * పై లష్మిణరాపుగారి వ్యాస మముద్రితము. దానిని నేను పూర్తిగా చూడఁగల్లి యుండిన నెంతో లాభపడియుందును. కాని సాధ్యముగాలేదు. పై వ్యాసభాగము నం. సు, గారి వేమనలో నుదాహృతము (మా, పు 181)