పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన యోగసిద్ధి-మత ప్రచారము 85

యని యాలోచింపవలసిన యక్కర యతనికి తోఁపలేదు. స్వార్థము ప్రకృతి స్వభావ ధర్మము. దాని కితరులు విఘ్నము గల్లించుపఱకును ఇతరుల కష్టసుఖముల నెవ్వరును సామాన్యముగ గమనింపరు. కావున స్త్రీ, పురుషుని యిల్లు, వాకిలి మొదలగు వానివలె ఆస్తిలో చేరిపోయెను. వానిని సంరక్షించుట, కాచుకొనుట, తనకు పనికిరాకున్న పడఁగొట్టుట మొదలగు నధికారములు మగవానికి వచ్చి యతఁడు భర్త” యాయెను. తక్కినవానివలె నాcడుదియు *భార్య యాయెను. కాని యిల్లు వాకిండ్లకు లేని తెలివి, స్త్రీలకు, పురుషులకువలెనే, కలదు గావున, స్వాతంత్ర్యకాంక్ష వారివలె వీరికిని గలిగెను. దేహబలమే యుండియుండిన, వీరేశ లింగము పంతులుగారి 'ఆఁడు మళయాళము" ఎన్నఁడో నిజమైయుండును. అది లేకపోవుటచే ఇతరవిధముల మగవారిని వశపబచుకొని వారిపై దొరతనము చేసి కసి దీర్చుకొనవలెనను ప్రయత్నము జరిగినది. స్త్రీపురుషు లొకరిని జూచి యొకరు మోహించి లోపడుట సమానమైనను, స్వాతంత్ర్యము గలవాఁడగుటచేత మగవానికి తన మనసును నిల్చుకొను శక్తిపోయినది ; స్త్రీకి పారతంత్ర్యముచేత నది హెచ్చినది. కావుననే యేయే మార్గములచేత పురుషుని ముగ్రునిగాఁ చేయవలయునని యవన్నియు నేర్చుకొనపలసి వచ్చెను. తుది మొదలులేని యలంకారములు, వేషములు, మఱుగులు, మౌనములు స్త్రీధర్మములైనవి. నేఁటికిని స్త్రీ మనసు నీడ్చుటకు పరుషుఁ డెన్ని విద్యలు నేర్చినాఁడో, యన్నిటికన్న నెక్కుప పురుషుని మనసు నీడ్చుటకు స్త్రీలు నేర్చినారనుట సహ్యము గాకపోయినను సత్యమైన విషయము. మగనిపైని స్వాతంత్ర్యమును సంపాదించిన యావిద్యలు క్రమముగా మగజాతిపై ప్రయోగింపఁబడినవి. కావుననే పురుషుని చెఱచుటకే స్త్రీ పుట్టినదను దుర్బావ మొకటి మగవారిలో ప్రబలించెను. మసువు ఇట్లు చెప్పినాcడు—

 
             “స్వభావ ఏషనారీణాం సరాణామిహదూషణమ్.
              ఆవిద్వాంసమలం లోకే విద్వాంససుపివా పునః
              ప్రమదాహ్యుత్పథం నేతుం కామక్రోధవశానుగమ్" (మను, 2 అధ్యా.)

(మగవారిని జెఱచుట స్త్రీల స్వభావము, చదివినవానినిగాని, చదువని వానిని గాని కామక్రోధవశుఁడైన వానిని తప్పుదాని కీడ్చశక్తి స్త్రీకి కలదు.)

కావున మగవాఁడెట్లూరకుండఁగలడు? తాను జేసిన తప్పెఱుఁగక, వారి నణcచుట తన స్వభాపముగాఁ జేసికొని, అందుకుఁ గావలసిన బందుకట్లు, సంకిళ్లు, తలుపులు, తాళములు, ఎన్నియో కనిపెట్టినాఁడు. ఇల్లే చెఱసాలగా మార్చు కొన్నాఁడు. ఎప్పడును వారిపై 'నిగా యుండుటయే యతని ధర్మమైనది.

కాని హిందూ సంఘమందలి స్త్రీలెల్ల నిట్లే యుండిరనియు, మగవారెల్ల వారిని గూర్చి యిట్టి భావములే కలిగియుండిరనియు చెప్పలేము. పరస్పర విరుద్ధములైన విషయములకు హిందూ సంఘమందున్నంత విశాలావకాశము మఱెక్కడను లేదు గాఁబోలు. అదే మనుస్మృతిలో వేఱొకచోట

           "యత్ర నార్వస్తు పూజ్యనే రమనే తత్రవేవతా !
             యత్రేతాస్తు సపూజ్యస్తే సర్వాన త్రాఫలా: క్రియా:" (మను, 3-56)

(స్త్రీల నేచోట పూజింతురో " యాచోట దేవతలు సంతోషింతురు. వారు పూజింపఁబడని స్థలములో నెన్ని సత్కర్మములు చేసినను నిష్ఫలములగును.) అని చెప్పఁబడినది ! ఇదిగాక స్త్రీ వ్యక్తి సృష్టిచేయు బ్రహ్మయొక్క శక్తి యని నిర్ణయించిన తాంత్రికులు, జగన్మాతృరూపిణియగు శక్తి నుపాస్య దేవతగాఁ