పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 84

ఇట్లే యెంగిలిని గూర్చిన యితని వాదమును విచిత్రమైనది. సామాన్యముగ నోటిలోనిజొల్లు ఆహారాదుల దోషముచేతను, రోగక్రిములచేతను దుష్టముగా నుండును గావున, మనుష్యునిదేహమందు వెడలు మలములలో నదియు నొకటిగా భావించి, దాని సంపర్కముచే ఇతరులకు రోగముల సంక్రమణములును, అసహ్యమును కలుగకుండ వలెనని, యెంగిలి చేయరాదని, యెంగిలి యన్నము తినరాదని, మనుష్యులు నియమము లేర్పఱచుకొన్నారు. ఎంగిలి యన్నము నితరులకు పెట్ట రాదని వేమనయు నొకమాఱు తలఁచినవాఁడే (639). కాని దానినతిచేసి వీధులలో నడుచునప్పడును ఎంగిలి మంగలములు తొక్కుదుమేమో యని పేడనీళ్ళు చల్లుకొని యడుగులు పెట్టువారును, ఎంగిలి పాత్రములు దర్బవేసి కాల్చువఱకును పనికిరావనువారును మనలో నున్నారు. ఇది యసహ్యమని యందరంగీకరింప వలసినదే; కాని విరక్తుఁడైన తరువాత వేమన్న యేమన్నాఁడో వినుఁడు -

         "ఆ. ఎంగిలెంగిలనుచు నీనోటితోడనే
               వేదములను జదువు వెఱ్ఱులార !
               ఎంచిచూడ నదియు నెంగిలి గాదొకో ..." (596)

వారి దొక మూలయైన నితని దింకొక మూల ! వేదము శబ్దమే! అదియు ఎంగిలి యన్నమాట కర్థమేమి ? శబ్దమునకుఁగూడ సాంక్రామిక రోగములు వ్యాపించునా? అను నీ మాత్రపు ప్రశ్నలు వేమన్నకు తోcపలేవని కాదు. తోఁచినను ఆ యుద్రేకప టుడుకులో గమనింపలేcడంతే.

ఇట్లే ఏకాదశి మొదలగు దిసములలో నుపవాసముండిస పాపములు నశించి పుణ్యము గలుగును; తపస్సుచేసిన నష్టైశ్వర్యములు లభించును; తిరుపతికో, శ్రీశైలమునకోపోయి, యందలి దేవుసకు సేవచేసిన మోక్షము నిచ్చును—అని సామాన్యముగా నందఱును నమ్ముదురు. నెలలకొలఁది యుపవాసములుండి లేని రోగములు తెచ్చుకొన్నవారున్నారు. తపస్సు చేయఁబోయి నష్టైశ్వర్యులైసవారు గలరు. దేవళములలో మూలవిగ్రహములకేకాక, యందలి కంబాలకు దూలాలకును మొక్కువారును లేకపోలేదు. కావున ఈ యుపవాసము, తపస్సు విగ్రహపూజ మొదలగువాని యందలి దోషములను గమనించి ఖండించువారున్నారే కాని యివి శుద్ధముగా నిష్ఫలములని యేతెలివిగలవాఁడును ఇదివఱకుఁ జెప్పలేదు. కాని ఈ పాపకార్యములకు వేమన్న ధర్మసూత్రములలో శిక్ష యేమనుకొన్నారు?

        "ఆ. ఒక్క ప్రొద్దులున్న నూరి పందై పుట్టు,
              పృథివిదపము సేయఁ బేదయగును ;
              నిగిడి శిలకు మొక్కు నిర్జీపులౌదురు..." (794)

ఇవన్నిటికన్న పైయుద్రేకము ఒక్క విషయమందు వేమన్నను చాలచెఱచినది ; అదేదనఁగా సృష్టియందలి స్త్రీవ్యక్తి, మొదటినుండియు మనుష్యజాతిలో మగవాఁడు తన సులోచనములతోనే చూచి ప్రపంచస్వరూపమును నిశ్చయించెను. సహజముగా గర్భధారణము, ప్రసవము మొదలగు ప్రకృతి సిద్ధములైన భారములు, మోయవలసి యుండుటచే తనకన్న దుర్బలురాలైన యాఁడుది తనకు తప్పక కావలసిన వస్తు వగుటచే, తనచేతిక్రింద నుండవలయుననియు, తను చెప్పినట్లు వినవలెననియు పురుషుఁడు నిర్ణయించెను. అది తనకెంత యావశ్యకమో తాను దాని కంతేగదా