పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/87

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                   వేమన యోగసిద్ధి-మత ప్రచారము    81

గురువు ఈ వేదదీక్ష నిచ్చెను గా(బోలు. వివేకానందుఁడు మొదలగు శిష్యులకు రామకృష్ణపరమహంసుఁ డిట్టి దీక్షనే యిచ్చినట్లున్నది. *[1]

 
             "ఆ. గతముచేసిసట్టి కర్మబంధములెల్ల
                   పరిసి పోవు సత్యగురుని పలన
                   కుమ్మరి కొకయేడు గుదియకు నొకనాఁడు..." (1249)
                                  (గుదియకునొకయేటు' అని వ్రాఁతప్రతులు)

ఇదియే నిజమగునేని ఆసనాదులు నిరర్ధకములని యితఁడు తిరస్కరించుట సహజము. కాని యితఁడు తనయనుభవము నితరులకు బోధించినపుడు అట్టి గురువు నాశ్రయింపఁడనిచెప్పలేదు; మిరే సాధింపుడన్నాడు.

            "ఆ. ధాత్రి జనులకెల్లఁ దగ నెఱిఁగించెద
                  నొసర హరుని జూచు నుపమయొకటి ;
                  మససు చెదరనిక మహిమతోఁజూడుఁడ్..." (2137)

            "ఆ. తారకంబుఁ జూచు దారివేఱే కద్దు,
                  సమముగాను జూడC జక్కCబడును;
                  వెఱ్ఱిగాను జూడ వెలుఁగెల్లఁ బాఱురా.." (1922)

అనఁగా నిది స్వప్రయత్నముచేతనే సాధింపవచ్చునన్నమాట. ఏమో ! ఎవ రెఱుగుదురు ?

 
           "ఆ. రాజయోగి మహిమ రాజయోగికిఁ గాక
                 యితరజనులకెల్ల నేమి తెలియు...? (3293)

ఇట్లు అసంప్రజ్ఞాతసమాధిమహిమచే తానే దైవమని యెఱిగిన వెంటనే, యదివఱకే యుందుమా పోదుమాయని యూఁగులాడుచుండిన హరిహరులు ఇతని ప్రపంచమునుండి యంతర్ధానమైపోయిరి. “తాను దేవుఁడైన దైవమే కొలుచురా (3293) యను వానిపద్ద నేదేపతలకుప్పు పుట్టును ? ఇతఁడు—

 
           "ఆ. బ్రహ్మఁ జంపి విష్ణుభాగంబులోఁ గల్పి .
                 విష్ణుఁ జంపి శివుని నీటగలిపి
                 శివునిజంపి తాను శివయోగి గావలె...." (2783)

అని సంకల్పముచేసి గెలిచినవాఁడు ! కావుననే వెనుకఁజెప్పినట్లు,

 
           "ఆ. బ్రహ్మవ్రాఁత కెదురు పల్కినవాడుఁను
                 ఆది విష్ణు సూత్ర మడఁచువాడు
                 మూఁడుకనులవాని మొనసి నిల్చినవాఁడు
                  కానఁబడరు నీవుకాని వేమ" (ఓ. లై., 12-1-30)

ఆని చెప్పకొని త్రిమూర్తలపై కసి దీర్చుకొనెను. కాని శైవఁడై పుట్టినందుకు అందఱిని అగువఱకు శిపునకు శిక్షనీయలేదు : అంతే గౌరవముగా పరమేశ్వరుఁడు సంతోషింపవలసియున్నది. పై రాజయోగసాధనవలస వేమన నిజముగా తత్త్వజ్ఞానమును సంపాదించెనా ? అతఁడు బోధించిన యద్వైతమే పరమతత్వమా అనుప్రశ్నలకు బదులుచెప్పట నాశక్తికి మీఱినపని, బ్రౌను దొర ఇతని సిద్ధాంతము అర్థము కానిదనియు నిష్పల

 1. * See “The Life of Srce Ramakrishna”.