పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన యోగసిద్ధి-మత ప్రచారము

               “సోయమేవాస్తు మోక్షాభ్యోమాస్తుతావా ఒపిమతాస్తరే,
                మనఃప్రాణలయే కశ్చిదానన్ద స్సంప్రవర్తతే"
(మతాంతరు లిది మోక్ష మననిండు, కాదన నిండు. మనన్సు ప్రాణమును లయించె నేని యొకవర్ణింపరాని యానందము మాత్రమున్నది)
                                                                                      (హఠయో, ఉప. 4, ప. 30)

కాని మన ప్రశ్న కిది ప్రత్యుత్తరముగాదు. మఱియు, యోగశాస్త్ర ప్రవర్తకుడగు పతంజలి యిూ 'ఆనంద’ మను పేరే యెత్తలేదు. "దుఃఖమేన సర్వం వివేకినః" అని చెప్పిన యతఁడు సుఖదుఃఖరూపమగు చిత్తధర్మ నాశమే మోక్షమనియెను. ఆ ముక్తావస్థలో ఆనందమును గీనందమును ఒకటియ లేదని భోజరాజు స్పష్ట ముగా వ్రాసెను.*[1] ఆద్వైతులు ముక్తావస్థయందు సచ్చిదానందమయమగు బ్రహ్మ సాక్షాత్కారము-అనఁగా, తానే బ్రహ్మగానుండుట-కలుగుననిరి. శైవలగు వద్వైతులును ఇట్లే తలంచిరి.

               క.ఆమనస్క సౌఖ్యమద్భుత
                  మమలం బసదృశ మఖండ మక్షయ మవిత
                  ర్క్య మచంచల మమృతమయం
                  బమితంబది యెఱుఁగుదురు మహాసిద్ధవరుల్"
                                                                             (శివయోగ సారము, 4 ఆశ్వాసము)

ఇట్లు కేవల యోగులకును అద్వైత యోగులకును అసంప్రజ్ఞాత నమాధి ఆనంద రూపమా శూన్యరూపమా యను విషయమున భేదముకలదు గాని యద్వైత విషయమున-అనఁగా, రెండుగాక యొకటిగా మిగులుటలో భేదములేదు. ఈశ్వరుని కేవల మొకసాధనముగా మాత్రము గొని సుఖదుఃఖములు రెంటినుండియు విడుదల పొందఁ గోరిన కేవలయోగులను వదలితిమేని, ఈశ్వరసాక్షాత్కారమే ప్రధాన ఫలముగాఁ గొని సాధించు నితర యోగులందును ఆ కడపటి సాధనావస్థలో అనందమున్నదనియే చెప్పెదరు. అది యట్లుండె,

ఆట్టి కైవల్యమును శాంతమార్గమున సాధించుటకు చాల దినములు పట్టును. అనేకుల కాయువు చాలదేమో యను భయము గలుగును. కావున సాధ్యమైనంత త్వరలో దానిని సాధించి ము_క్తి పొందఁగోరువారు దేహమనస్సుల నెక్కువ బలవంత పెట్టి లొంగఁదీయుదురు, ఈ మార్గమునకే హఠయోగమని పేరు. "హ"కార మునకు ఊర్ధ్వగతియగు ప్రాయివాయువును"ఠ'కారమునకు అధోగతిగల అపాన వాయు వను అర్థమcట. ఈ రెంటికిని ఐక్యము సంపాదించి సాధించుట హఠయోగము. కావున వీరికి దేహ మనస్సులను దండించు ఆసనప్రాణాయామములు ముఖ్య ములు. ఇది గాక దేహమందలి రోగములను నశింపజేయుటకును, శ్వాసకోశములు, కడుపు, నాసారంధ్రములు మొదలగు వానియందలి కఫాదిదోషములను బోఁగొట్టు కొనుటకును, ధౌ తి, నౌళి మొదలగు కర్మములను, బ్రహ్మచర్యమును సాధించు టకు వజ్రోళిమొదలగు యోగములును వీరు సాధింతురు. ఈ మార్గములచే సాధింపగా కడుపుక్రింది మూలాధార మందుండెడు కుండలిని యనుశక్తి, నిద్రించు చుండెడిది, పైకిలేచును. అప్పడు కుడియెడమ ముక్కులందలి ఇడ, పెంగళ అను నాడులలో సహజముగా సంచరించు వాయువు, ఈ రెంటి నడుమనున్న

  1. * చూ, పా, యో, సూ, భోజరాజ్యవాఖ్య, కడపటి సూత్రమునకు.