పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/79

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                  వేమన యోగసిద్ధి-మత ప్రచారము     73

చేయక తీఱదనియు నన్ని దేశములవారు సంగీకరించిరి. కాని, ఆ దేహమనోనిగ్రహ మార్గమును ఉపక్రమోపసంహారములతో సక్రమమైన శాస్త్రముగా నేర్పఱచిన గౌరవము, నే నెఱింగినంతవరకు, హిందువులకే చెల్లవలసియున్నది. దేహమును స్వాధీనపఱకొసవలయునని నానావిధముల దండించి, మనసును బిగఁబట్టి బహిరంగములనుండి విడఁదీసి, లోపలధ్యానమునకుఁ బూనుకొన్నప్పడు, పై రెంటికిని కలుగు అనేక పరిణామములను, అనుభవములును చక్కఁగా గమనించి, అందుఁగలుగు అనిష్టఫలములు నివారించి, ప్రధానోద్దేశమగు పరబ్రహ్మానుభవమును సాధించుట కెన్ని పద్ధతులు గావలయునో, యవన్నియు ననుభవపూర్వకముగా యోగ శాస్త్రకారులు వ్రాసిరి.

యోగాభ్యాసుల మొదటి ధర్మము తమ యందలి దుర్గుణములను వదలుట. యోగ్యత సంపాదించుటకు మొదలు అయోగ్యతను పోఁగొట్టుకొనపలయును గదా?" దేహబలమును సంపాదించుటకు మొదలు రోగములకు మందుదిన్నట్లు. ఒకరిని. హింసింపక, అసత్యమాడక, ఒకరిసొమ్ము దొంగిలింపక, ఇంద్రియలోలుఁడుగాక, తనకెంత ముఖ్యముగా కావలయునో యంతకన్న నెక్కువ దానమిచ్చినను గ్రహింపక యుండుట మొదటిమెట్టు. ఇదే యమ మందురు.

తరువాత పరిశుద్ధముగా నుండుట, సంతోషము, తపస్సు, వేదశాస్త్రములు చదువట, భగవద్భక్తి-వీనిని సాధింతురు. ఇవి నియమ మనఁబడును.

ఇట్లు దేహమనస్సులు కొంతవఱకు పరిశుద్ధములైన తరువాత దేహమం దిది వఱకున్న రోగములు నశించుటకును, క్రొత్తవి రాకుండుటకును శ్రమము, సహించు శక్తి గలుగుటకును కొంత వ్యాయామము చేయుదురు. వ్యాయామ మసఁగా 'గారిడీ" లోఁగాని, ఇప్పటి స్కూళ్ళలోఁగాని చేయునట్టిదిగాదు. చేతులు, కాళ్ళు మొదలగు నవయవములు ప్రత్యేకముగాఁగాని, మొత్తముగా దేహమునుగాని, యేదైన నొకగతిలో పలుమాఱు ఆడించుట యిప్పటి పద్ధతి. ఇందువలన కండలు మాంసము బలసి దేహమున కొవ్వుపట్టును. ఒక విధమైన నిలుకడలేని చురుకుcదనము గలుగును. యోగులయుద్దేశమదికాదు. శ్రమమును సహించుట, దేహమందు జిడ్డుపెరుగనీక లఘువుగా చేసికొని నెమ్మదిని సంపాదించుట-ఇవి వారు కోరునది. కావున ఏదో యొక కష్టమైన తీఱులో చాల ప్రాద్దు నిలుచుకొని యుండుట, కూర్చుండుట, పరుండుట, వారు సాధింతురు. వీని వాసవము లందురు.

ఇంతై నను దేహమున కెప్పడును చలనమునిచ్చి తన్మూలమున మనస్సును చలింపఁజేయు వస్తువొకటి గలదు. ఆది వాయువు. దానిని స్థిరముగా నిలుపనిది మనస్సు నిశ్చలము గానేరదు.

               "చలేవాతే చలంచిత్తం నిశ్చలే నిశ్చలంభవేత్"
                (గాలిగదలిన మనసుకదలును ; ఆది నిలిచిన నిదినిలుచును.)
                                                                   (హఠయోగ ప్రదీపిక, ఉపదేశము 2, ప. 2)

కావున లోని యూపిరి బైటికిఁ బోనీయక, బైటియూపిరి లోనికి రానీక లోపలనే పట్టి నిలుపుట యావశ్యకము. దీనినే ప్రాణాయామమందురు. దీనిచే" మనస్సు నావరించియున్న మాలిన్యములన్నియు నశించు నందురు. తరువాత కన్ను, ముక్కు మొదలగు పంచేంద్రియములు తమకు విషయము. లైన, రూపము, వాసన, మొదలగు వానియెడఁ బోనీయక మనస్సేప్రక్కఁబోయిన నా ప్రక్క పరాధీనములై యుండునట్లు సాధింపవలయును. ఇదే ప్రత్యాహారము.