పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 68

తత్త్వములందెక్కువ భేదము లేకున్నను, మోక్షావస్థయందు శివునితో సాయుజ్య మును జెప్పుచు, జీవబ్రహ్మలకైక్యము దానికన్న నెక్కువగా నంగీకరించినది*[1]. మూఁడవదియగు శాంకరాద్వైతము, మోక్షస్థితిలో మాయాజనితమైన భేదజ్ఞానము పూర్తిగా నశించి నిత్య శుద్ధబుద్దమైన బ్రహ్మస్వరూపము మాత్రము నిలుచునని చెప్పుచు సర్వాద్వైత మనఁ బడుచున్నది.

ఈ ముగ్గురిలో వైష్ణవులు, మోక్షమనఁగా భగవల్లోకములో అతనివంటి దివ్య మంగళవిగ్రహము గలిగి ద్వంద్వాతితులై యతని కైంకర్యసౌఖ్యము ననుభ వించుటయేయని తల(చిరి గావున, ఆ యధికారమును భగవంతుఁడనుగ్రహించు టకు దృఢమైన భక్తి వారికి చాలును. కాని యాయవిచ్చిన్న భక్తిని సంపాదించు టకును యమ నియమాది సాధనములు కాపలయును గాన వారు ప్రపత్తియను వేరొక సులభమార్గమును వెదకికొనిరి. అనఁగా భగవంతునియెడ తమ సమస్త భారమును అర్పించి నీవే దిక్కని నమ్మియుండుట. ఆదియును తామే చేయుటకు చేతఁగానివారు యోగ్యుఁడగు గురువు నాశ్రయించి, యతఁడు భగవంతునియెడఁ దనకుఁగల చనవుచే సిఫారసుచేయఁగా ఆ భగవంతునికి దయగలిగి తప్పలను క్షమించి తమ్ముద్ధరించి ముక్తి నిచ్చునని నమ్మిరి. ఇదే ఆచార్యనిష్ట ప్రపత్తి యనఁ బడును. ఎట్లును వారికిఁ గావలసినది సామాన్యముగ అహంకార మమకారాదులను వర్ణించి భగవంతునియెడ దైన్యము స్థిరముగా నుండుటకు ఎంత దేహేంద్రియ మనోదండనలు ముఖ్యమో అంతేకాని, యంతకు మీఱి హఠయోగాదులు సాధింప వలసిన పనిలేదు గావునను యోగులు పరమఫలముగాఁ జెప్పనట్టి యుద్వైతాను భవమునందు వారికి నమ్మిక లేదు గావునను వా రా మార్గమును వదలిరి. కావననే శ్రీవైష్ణవులు వ్రాసిన యోగశాస్త్ర గ్రంథ మొకటియుఁ గానరాదు. నాథమునులు *యోగరహస్య"మను గ్రంథమును వ్రాసిరఁట కాని యది యింకను బ్రెలుపడలేదు. ఎట్లును ఇప్పడు పాతంజలయోగసూత్రములు, యోగ తత్త్వపనిషత్తు, హఠప్రదీపక మొదలగు గ్రంథములు చెప్పనట్టిదియు, ఇప్పడును సామాన్యముగ యోగు లనఁబడువా రాశ్రయించినదియును ఆగు యోగవిద్యకును శ్రీవైష్ణవాద్వైతులకును సంబంధము గానరాదు.

ఇ(క శంకరుల యద్వైతము యోగసాహాయ్యము లేనిది బ్రతుకుటయే కష్టము. ఎందుకన(గా, వారి సిద్ధాంతము సమస్తమును మిథ్యయనియు, శుద్ధ నిర్గుణ బ్రహ్మయే సత్యమనియు, ఈ మిథ్యాజ్ఞానము నశించి శుద్దబ్రహ్మముగా నిల్చుటయే మోక్షమనియు చెప్పుచున్నది. అనగా మోక్షావస్థయందు తెలిసికొనుకర్త తెలియఁ బడు కర్మము అను భేదమేలేక కేవలము తెలివిగామాత్రము నిలిచియుండుట. ఎన్ని ప్రమాణములు చెప్పినను ఎంత వాదించినను అనుభవప్రమాణము లేనిది యీ సిద్ధాంతము నమ్ముట కష్టము. అట్టి జ్ఞాతృఙ్యేశూన్యమైన జ్ఞానావస్థ సాధ్య మనియు, అసంప్రజ్ఞాత సమాధిస్థితి యదియే యనియుఁ జెప్పి యోగశాస్త్రము దానిని సాధించు మార్గములను తెలుపుచున్నది. కావున శాంకరాద్వైతులు యోగము వదలేదు.

అద్వైతానుభవము విషయమున వీ రిరువురికి నడుమనున్నవారు వీరశైవులు. శివతత్త్వము సహజమగు 'శక్తి'బలముచే 'లింగ"మనియు, ‘అంగ"మనియు

  1. * Vide Bhandarkar’s Vaishnavism and Saivism, p. 135.