పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన కాలమందలి మతధర్మముల స్థితి 63

చెలాయించి, బ్రాహ్మణులు, మర్యాద ధనము మొదలగువానిలో “దేవాంశము'ను*[1] నంపాదించుకొనఁ జొచ్చిరి. వీరిలో విద్య వివాదమునకుమాత్రము పనికివచ్చునది యాయెను. ఏశాస్త్రమును ఏకళను నేర్చుకొన్నను దానికిఫలము పరముఖభంగమై తర్కశాస్త్ర పాండిత్యమావశ్యకమాయెను. రాజసభలలో నిట్టికోవిదుల కొట్లాటలు నిత్యకార్యములై, అందు గెల్చినవారికి 'దుశ్శాలువలో, సుశాలువలో బహుమానము దొరకుచుండెను. ఇట్టి వాదములనుగూర్చి వేమన్న యేమన్నాఁడు ?

          "ఆ. సాటిచేయవచ్చుఁ జదివివాదములాడు »
                చదువరులను జెట్టి సముదయమును
                పోరిపోరి గెల్చు నోరు నోవనివాఁడు..." (3873).

తుదకు పండితుఁడైనవాఁడు దేవళమునకుఁ బోయినప్పడు తనకుతగిన మర్యా దలు జరుగకుండిన, పూజారులను విడిచి,

             "ఐశ్వర్యమదమత్తేసి మాంనజానాసి దుర్మత
               పరైః పరిభవే ప్రాస్తే మదధినా తవస్థితి:"†[2]
                                (ఈ పద్యము పలువురు పండితులు చెప్పినట్లు వాడుక)

అని బ్రహ్మనే బెదరించు స్థితికి బ్రాహ్మణులు వచ్చిరి!

అనగా మనుష్యులందఱు నిట్లేయుండిరనికాదు. అది యసంభవము. నిజమైన విరక్తులు, తత్త్వదృష్టిగలవారు, శమదమాది సంపన్నులును అందందుండిరి; కాని వారికి సంఘమందు వ్యాప్తి చాలకుండెను-

         "ఆ. భూమిలోన పుణ్యపురుషులు లేకున్న
               జగములేలనిల్చు పొగులుఁ గాక,
               అంత తలుచుదొరక రాడనాడనుగాని...? (2868)

అని వేమన్నయే యున్నాడు. ఇట్లు సంపుమందెల్ల నించుమించుగా నొక ప్రక్కన జ్ఞానమును, వేఱొకప్రక్క నన్యాయమును పరస్పరసహాయముతో వృద్ధి బొందుచుండె ననుటలో సందేహములేదు. వేమన కాలమందలి సంఘస్థితి యిది. ఇతఁడు శైవమతము నాశ్రయించిన కుటుంబములోని వాఁడని మొదలేచెప్పితిని. అందుమ బసవేశ్వరునిచే, వ్యాప్తికి తేఁ బడి సదియు, బ్రాహ్మణులకన్న నితర జాతులలోనే చాల వ్యాప్తిఁగాంచి నదియునగు లింగధారి వీరశైవమతమునకుఁ జేరియుండును. ఈ మతము జాతిభేద తిరస్కారముతోనే మొదలైసను, దీని నాశ్రయించినవారే వేఱుజాతియై, అందులోను, అవాంతర భేదములు గలిగి యిప్పటికి నట్లేయున్నది. ఇక చుట్టుప్రక్కల ప్రబలి యున్నది వైష్ణవమతము. సహజముగా నితరులు చెప్పిన మాటలు విచారింపక నమ్మని వేమన వంటి విమర్శకునకు, పైరెండు మతములలో నేదిగాని తత్త్వపిపాస. నార్పఁగలిగి యుండలేదు

    • దేవస్థానములందు నైవేద్యమును భక్తులకు వినియోగము చేయుటకుముందు పూజారులకిచ్చు పెద్దముద్దకు 'దేవాంశ' మనిపేరు. -
  1. † ఓ దుర్మతీ ! నీ వైశ్వర్యముచే పొగరెక్కి మదించినావు, నన్ను లక్ష్యము చేయప. ఇతరులు నీ కవమానము కలిగించునప్పడు సీ మర్యాద నా చేతిలో నున్నది. అని తాత్పర్యము.