పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                  వేమన కాలమందలి మతధర్మముల స్థితి      61

దెలిపి బంధమోక్షమునకు మార్గముగా నేర్పడవలసిన యీ హరిహరమూర్తులలో పరన్పర భేదమట్లుండఁగా ఒక్కొక మూర్తియును ఆనేక భేదములు గలదైనది. ఉపాసనసాధనములుగా నుండవలసిన విగ్రహములు దేవతలుగానే తలఁపcబడెను. సంఘదేవతలు జాతిదేవతలుగను, దారిదేవతలుగను, ఇంటి దేవతలుగను అవతార భేదములు దాల్పపలసిపచ్చెను. ఉపాస్యదేవతలలో నిన్ని భేదములున్నప్పడు ఉపాస కులలో భేదములుండుటలో విచిత్రమేమి ? ఉపాస్యదేవతలమాట యట్లుండఁగా, మనుష్యులలోనే కాలము, దేశము, సంస్కారము, వాడుక, స్వభావము మొదలగు వానిచే నసంఖ్య భేదము లేనప్పుడును గదా? అవన్నియు ఉపాస్యదేవతయందును సంక్ర మించును. చూడుఁడు-మాధ్వులకును రామానుజీయులకును దేవత యొకటేకదా? ఇరువురును ఊర్ధ్వపుండ్రము (నిలువనామమును) ధరించువారే కాన వారిదేవత కును ఊర్ధ్వపుండ్రమే వేషమైనది. కాని యది గోపీచందనముతోనా తిరుమణితోనా యనుటలో భేదముగలిగినది. మాధ్వులదేవత గోపీచందనదేవత ; శ్రీవైష్ణవులది తిరుమణి దేవత. వీరిలో తిరుమణిపుండ్రము రెండు తెరంగులు-తెన్గల, పడగల యని. శ్రీరంగములో తెన్గల రంగనాధుఁడు; కుంభకోణములో వడగల శార్థపాణి. ఈ యిరువుర నామముల కలహము నింకను ఏకోస్టువారును తీర్పఁగలుగలేదు. భేద మునకు తరువాత మొట్టు ద్వేషము. ఒకరిపై నింకొకరి కసహ్యము. పరస్పర కలహ ములు. ఇట్లు మోక్షమునకై యన్ని ముప్పతిప్పలఁ బడి తుదకీ మొసలినోటికే వచ్చి పడినట్టినది మనుష్యుల యపస్థ !

ఎప్పుడిట్లు సగుణనిర్గుణవాదములు రెండుసు ఏకమై సత్యమును నిర్ణయించు టకు బదులు సంసారమును వృద్ధిచేయుటకే మొదలుపెట్టెనో, అప్పడే తత్త్వజ్ఞానము నకుఁ గావలసిన నిష్పక్షపాతము, విరక్తి మొదలగు నుదారగుణములు నశించి, స్వార్థపరత, స్వాభిమానము మొదలగు సంసారిలక్షణములు మతములలో వేరూరి నవి. బ్రాహ్మణులలో ననేకులు తత్త్వమును వదలిపెట్టి మతమునకు చేయివేసి చాలవఱగును స్వాధీనముచేసికొనిరి. తక్కినవారికి మతబోధచేయుచు నయభయ ములచే వారిని తమ మతమునకు(ద్రిప్పకొనుచు, జనుల కులాచారముల నిర్ణయించి, బహిష్కారములు, పాదతీర్ధములు, ప్రాయశ్చిత్తములు మొదలగు మార్గములచే సంభావనలు సంపాదింప మొదలిడిరి. యమనియమములు నిత్యకర్మములుగాఁ గలిగి, విరక్తి జాతిధర్మముగాఁ గలిగి, *స్వస్తి ప్రజాభ్యః" అనియు 'జనయతు జగతాం శర్మ వైకుంఠనాచ" అనియు నిత్యజపము చేయుచు, ప్రజాసేపకై దారిద్ర్యమే వ్రతముగాఁ బూనవలసిన విప్రులాకాలమం దెట్టులుండిరో, యీక్రింది పద్యమునం దొకానొక బ్రాహ్మణపండితుఁడే యిట్లు వర్ణించినాఁడు:

             జారాంన్ఫోరాస్ కిరాతాన్ జనపదమథనాన్ రాజపాశాస్ మహీశాన్
             శిష్యాన్ కృత్వా2.తిమత్తా! శ్రుతినయవిధురా: శ్రోత్రియైర్బ్రహ్యానిష్టై:,
             సాకంనోభుజ్ఞతేźమీసకృదపివినతిం పర్వతే ఒగ్రే నతేషాం
             సంకేతేనైవ సిద్ధం తదిదమవిదుషాం శ్లామ్యమాచార్య పుంస్త్వమ్"*[1]
                  (విశ్వగుణాదర్శము)

 1. * ఈ ఆచార్యపురుషులు-జారులు, దొంగలు, డోయలు, దోపిడికాండ్రు, పాళయగాండ్రు, దొరలు-వీరిని శిష్యులనుగాఁ జేసికొని, మిగుల మదించి, వేదవిద్య యెఱుఁగకయున్నను, శ్రోత్రియులగు బ్రహ్మనిష్టులతోడ పంక్తిని భుజింపరు : వారియెదుర నొకమారును మొక్కరు. ఈ యజ్ఞానుల యాచార్యపురుషత్వము సంకేతమిచే మాత మేర్పడినదిగాని వేణుకాదు. అవి తాత్పర్యము.