పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/62

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శ్రీ:

నాలుగవ యుపన్యాసము

వేమన కాలమందలి మతధర్మముల స్థితి

వేమనకు ఇంటినంసారమునందు కలిగియుండవచ్చునట్టి పరిణామములను కొన్ని యిదివరలో నూహించితిమి. దీనికన్నను పెద్దనంసార మొకటున్నది. సంఘము, ఆలుమగల కలహము, బిడ్డలకు నిష్పయోజకత్వము, దారిద్ర్యము మొదలగున వెన్ని యుండినను వేమనవంటివాని యుక్కుమనసు అంతగా చెదరి యుండదు. అరాచకము, అజ్ఞానము, స్వార్థపరత, వంచన మొదలగు నన్యాయము లచే తనకాలపు సంఘము పడుచున్న యవస్థ వేమనను 'ఇంటిలోని పోరు' కన్న ఎక్కువగా కలంతపెట్టినది.

నాలుగు పురుషార్థములలో ఇప్పటి సాంఘిక రాజకీయ పరిణామములను గలిగించు ప్రధానశక్తి కామసాధకమగు నర్థము. ప్రాచీనసంఘమును, రాజ్యమును ముప్పుత్రిప్పలఁ బెట్టినది మోక్షసాధకమగు ధర్మము. అనఁగా, ఇహలోక సౌఖ్య కాముకులై దానిని సాధించు నర్థమును సంపాదించుట. తన్మూలమున సంఘమును బలవంతముగాఁ జేసికొని రాజకీయస్వాతంత్ర్యమును సాధించుట ఇప్పటి మన పరాయణము. మోక్షధర్మముల చింత యెవరో కొందఱు వ్యకులను కలఁతపెట్ట వచ్చునుగాని మొత్తముమీఁద మనము కాముకులమగు ఆర్ధికులము. ప్రాచీనులలో నిట్లుగాక మోక్షధర్మములను గూర్చిన సంస్కారము చిన్ననాఁటినుండి ప్రజలకు బోధింపఁబడుటచే వారి కార్యాకార్యములను అదే నిర్ణయించుచుండెను.

ఆనఁగా, ఇప్పటివారందఱును అధార్మికులైనబద్ధులని కాని, ప్రాచీను లందఱును ముక్తులగు ధర్మావతారులని కాని చెప్పరాలేదు. మఱియు ఇప్పటి మన మందఱును కుబేరులము, మన్మథులమునై వారందఱు బికారిసన్యాసులుగా నుండి రనియుఁజెప్పట నాయభిప్రాయము కాదు. పంచేంద్రియములును, హృదయమును వారివలె మనకున్నవి. మనవలె వారికి నుండినవి. కావున ఇహలోకమందలి సుఖ స్వాతంత్ర్యములందాశకాని, ఇందలి బంధములనుండి తప్పించుకొనవలెనను కోరిక గాని యిరువురికిని సమానమే. అప్పటి ధర్మ మెంత మంచిచెడ్డలను చేసినదో, యిప్పటి యర్ధమును అంతే చేయుచున్నది. ధర్మబుద్ధితో సర్వశక్తులను వెచ్చించి సత్రములు, సోపానములు, చెఱువులు, కాల్వలు మొదలగునవి నిర్మించి పరోప కారముతో జన్మము సార్థకము చేసికొనిన త్యాగశీలురు వారిలోఁగలరు. ధర్మ బ్రాంతితో జనులను హింసించి, చంపి, దోచి, దొమ్మిచేసినవారును వారిలో నుండిరి. ఆహెూరాత్రమును అర్థార్జనచేసి ప్రజాభివృద్ధికెంతయు వెచ్చించువారు నేఁడును గలరు. అక్షరలక్ష లిచ్చినాఁడని చెప్పఁబడు భోజరాజకన్న అణ్ణామలైచెట్టిగా రేమిటఁ దక్కువ? ఇట్లే ద్రవ్యలోభముచే ఇతరులను వశపఱచుకొని నిర్గతికు లనుగాఁజేసి, వారి జాతినీతిజీవనములను ధ్వంసముచేయుచున్న వ్యాపారు లిప్పటి