పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                            వేమన   50

ఇచ్చేవానిని చూస్తే చచ్చేవాడును లేచు" నను శాస్త్రము సత్యములలో సత్యము. బిచ్చగాండ్రకు బిడియములేదు సరికదా దయా దాక్షిణ్యములును నున్న,

            "భీభర్తు భృత్యాన్ ధనికో దత్తాం వాదోయ మర్ధిషు
             యావద్యాచక సాధర్మ్యం తావల్లోకో నమృష్యతి"*[1]
                                                 (నీలకంఠ దీక్షితుని కలివిడంబనము, ప, 69)

అన్నట్టు, తమవలె దాతయు బిచ్చగాఁడగువఱకును యాచకులకు తృప్తిలేదు. ఇంతమాత్రము వేమన్నగారి దానము వాసన తగిలినఁ జాలును. దేశములోని వారందఱును, కలవారును లేనివారును, ఇతని వంటయింటనే వచ్చి కూర్చుండి కాపురము చేయుదురు! ఇఁక నింటిలోని యాపై సమాచారము మన మెఱుఁగుదుము. ఇంకను వినుఁడు-

        "ఆ. భాగ్యవంతురాలు పరుల యాఁకలిదప్పి
              తెలిసి పెట్టనేర్చు తీర్పనేర్చు ;
              తనదు దుష్టభార్య తనయాఁకలి కాని
              పరుల యూఁక లెఱుఁగ దరయ వేమ" (2833)

ఈ యవస్థలో ఈ యతిథిపూజకు( కావలసిన }ద్రవ్య మెందుండివచ్చును? ఊరక యింటఁ గూర్చున్న జరుగదని సంపాదనకుఁ బ్రయత్నించి కొన్నాళ్ళేవఁడో యొక రాజును కొలిచి చూచెను. కాని యాకాలపు సామాన్యరాజుల నమాచారము వేఱుగా చెప్పఁబనిలేదు. మఱియు ఈ వట్టి వెచ్చగానికి వలసినంత జీతమిచ్చిన, వారికితఁడు చేయఁగలిగిన సేవమాత్ర మేమియున్నది? కత్తిఁబట్టి యుద్ధముచేయు నేర్పున్నట్లు తో(పదు. ఇఁక వారితో నిచ్చకాలాడి వారిని ఇంద్రచంద్రులని పొగడఁ గల యోర్పును ఇతనికి లేదు. కోపము వచ్చినచో పద్యాలతో తిట్టఁగలఁడంతే. తుద కదియే జరిగినది---

       "ఆ. ఎఱుకలేని దొరల నెన్నాళ్ళు కొలిచిన
             బ్రతుకు లేదు వట్టిభ్రాంతిగాని
            గొడ్డుటావు పాలు గోఁకితే చేపునా ?...." (691)

అని యొకనాటి కా తంటా వదిలించుకొన్నాఁడు. కాని ముందుమార్గము ? మాన మర్యాదలు వదలి ధనవంతులను యూచించి సంపాదింపఁ బ్రయత్నించెను. కాని యిచ్చువాఁడెవఁడు ? తుదకు వారికిని రెండు ఆశీర్వాదములు

        "ఆ. కండలెల్లఁగోయఁ గాసీయఁజాలని
              బండలోభి కాసపడినఁగలదే ?
              కొండక్రిందఁ బసిఁడిగోరిన చందంబు..." (866)

         “క, మృగములు మృగముల నడుగవు
             తగనడుగవు పక్షిజాతి తన సరివానిన్
             మగవాఁడడిగిన నీయని
             మగవాఁడా మగపగాక మహిలో వేమూ !" (3232)

ఎందైన ఒకరిద్దఱికిచ్చు బుద్దియున్నను వారు దుర్మంత్రుల చేతి కీలుబొమ్మలు---

 1. * ధనికుఁడు భృత్యుల నెంత పోషించినను, ఆడిగినవారి కెంత యిచ్చినను, యాచకుల తోడ నతఁడును సమానుఁడగు వఱకును జనులు ఓర్చి యూరకుండరు.