పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన సంసార స్థితిగతులు 47

యెఱిఁగిన ప్రాఁతకా(పు. అక్కడ సౌఖ్యములేదని యిక్కడనది గలదని యాశతో పెండ్లాడినవాఁడే కాని వేఱుకాదు. మఱియు, ఆమె కితనియం దెట్టి సందేహము. గలదో యితని కామెయందును అట్టి సందేహమే కలదు. అనఁగా, నా మెయందు దోషముండెనని కాదు. ఉండవచ్చునని కాని, కలుగవచ్చునని కాని, వేమన్నకు సందేహము గలదన్న మాట. మొదటినుండి స్త్రీని కేవల భోగ్యవస్తువుగా మాత్రము. భావించి, వారికి వేఱు తమకు వేఱుగా శాస్త్రములు వ్రాసుకొన్నవారి గుంపులోనే యితఁడును పెరిగినవాఁడు ; కాబట్టి'

      "ఆ, వరుఁడు చక్కనైన వజ్రాలగనియైన
            తళుకు మొఱుపువంటి తత్వమున్న
            అన్యపురుష వాంఛ ఆఁడుదానికినుండు...? (3422).

అని చిన్న నాఁటినుండియే యితని కుపదేశము జరిగినది. కనుకనే భర్త భార్యను స్వాధీన మందుంచుకొనవలెననియు, దానికి స్వాతంత్ర్య మీయరాదనియు నితఁడు, దృడముగా నమ్మినవాఁడు—

       "ఆ. మాట వినని యూలు మగనికి మరగాలు.' (3028)
       "ఆ. ఆలు మగని మాట కడ్డంబు వచ్చెనా
             ఆలుగాదు నుదిటి వ్రాలు గాని
             అట్టియాలి విడిచి యడవినుండుట మేలు..." (311)

       "ఆ. కాపవలయు మగఁడు కాంత నెల్లప్పడు
             కావలేని నాఁడు చావవలయు !
             కాcపు లేనిదాని కా(పర మడుగరా..." (1092)

అని యితని బోధ. అట్లగుటచే, ఇట్లు తనయందు గౌరవములేని--

      "ఆ. ఆలి వంచలేక యధమత్వమున నుండి
            వెనుక వంతుననుట వెట్టితనము
            చెట్టు ముదరనిచ్చి చిదిమినఁ బోవునా.." (301)

అని నిర్ణయించి, ఇతఁ డామెను ఇల్లు కదలనీక, ఇతరులను కన్నెత్తి చూడనీక, తన మాట కడ్డమాడనీక, దండింప మొదలుపెట్టెను. ఇక ఆమె మాత్రము రెడ్డికూఁతురు గాదా ! ఇతని రక్తమునం దున్నంత వేఁడి, స్వాభిమానము, ఆమె రక్తమునందును. గలదు గదా! కావున చూచినన్నాళ్ళను చూచి తుదకు నిర్లక్ష్యముచేసి ప్రతిఘటించి నిలచినది. ఇట్లీ రెడ్డిసానుల స్వాభిమానకలహములో ఉన్న ఆ ఇంత ప్రణ యమును పటాపంచలైనది. వేమన్న కిల్లు నరకప్రాయమైనది. ప్రభుత్వము చేయ వలసిన రెడ్లవంశమువాఁడు; అట్టి వానికి తన భార్యయే యెదిరించి నిలిచిన పౌరుషమున కంతకంటె హానికలదా ? మాటయెత్తిన వెంటనే యతని భార్య-

       "ఆ, వాడకుఱికి తిట్టు, వలదన్న మొఱఁబెట్టు,
             ముందు మగని దిట్టు, ముసుకుఁ బెట్టు,
             గడునురాలు మగని గంపఁబెట్టమ్మురా.." (3446)

కనుకనే “యిట్టి యాలితోడ నెట్లు వేగింతురా!? (3445) ' దేవఁడా" యని వేమన్న విసిగి వేనరినాఁడు. సహజముగా హింసాదులను సహించు స్వభావము గలవాఁడు కాఁడుగావున, ఇట్టి పనికిరాని భార్య నొక మాఱు గొంతు పిసికి చంపి పాఱవైచి, యింకొకతెను పెcడ్లాడుద మను రాక్షస కృత్యమునకు చొరఁగలవాఁడు. కాఁడయ్యెను. మీఁదు మిక్కిలి తానే 'చావవలయు’ నని తలచిన మానశాలి !