పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన. 46

టీక వ్రాసి పెట్టుకొన్నాఁడు!

ఎట్టి కాలమందైనను ఇతఁడిట్టి యవస్థలో నుండఁగా తలిదండ్రులుగాని తక్కిన బంధువులుగాని యోర్చియుండుట కష్టము. ఎప్పడును వేశ్యలు, బసివి రాండ్రు, దొమ్మరిసానులు మొదలగు వారి సావానమున నుండియున్న ద్రవ్య మంతయు వెచ్చపెట్టుచు, చేతలేనప్పడు సుప్రసిద్ధ చరిత్రముగల వేశ్యామాతల చేతి *అర్ధచంద్ర ప్రయోగము" లనుభవించుచు, చాల దుర్బల హృదయుడైన యితని నెట్లు త్రోవకుఁ దేవలయునా యని వారాలోచించి, వివాహముచేసినఁ గొంత మేలుగానుండునని తలఁచి యట్లు చేసిరి కాఁబోలు. సంపన్నుల యింటివాఁడు గావున నితనికి అట్టి వంశమందే జనించిన సౌభాగ్యవతి యొకతె ముడివడి యుండును. ఇదివరకు వేశ్యాప్రియత్వముచే పలు కష్టములు పడినవాఁడు గావునను, వారివన్నియు 'పూఁత మెఱుఁగువంటి వలపులే" కాని, పడుపువృత్తిలో హర్థమైన స్నేహము లేదని యొఱిఁనవాఁడు గావునను, ఆ త్రోవ యొక్కమాఱు చాలించి, తనధర్మపత్నియగు నామెపై ప్రేమనంతయు నిలిపినాడు. ఎ పనియు ఆరవాయితో చేయు స్వభావము గలవాఁడు కాఁడు గావున ఎప్పడును ఆమెను వదలి యుండనేర నంత ముగ్ధుఁడైనాఁడు—

       "ఆ. తుంట వింటివాని తూపులఘాతకు
            మింటిమంటి నడుమ మిడుకcదరమె ?
            ఇంటియా లివిడిచి యెట్లుండవచ్చురా!" (1952)

ఇదియేదో సందర్భమున గ్రామాంతరమునకుఁ బోవుటచే గాబోలు నొంటిగా నుండవలసి రాcగా నప్పడు చెప్పిన పద్యమై యుండును. కొత్త ధర్మపత్ని గూరిమి మగఁడైన యీ కాలమందే యితఁడిట్లు నిర్ణయించు కొనెను :

    "ఆ. ఇంటియూలి విడిచి యిల జార కాంతల
          వెంటఁదిరుగు వాఁడు వెఱ్ఱివాఁడు,
          పంటచేను విడిచి పరిగె లేరినయటు" (359)

కాని యీ వివాహము సుఖముగా పరిణమింపలేదు. కారణము స్పష్టమే. నవవధువు నవవరుని అభిలషించును. ఆమెను వేమన వరియించి యుండెనేమో గాని యూమె మాత్రము ఇతనిని తానై వరించియుండదు. అది తొంబదిపాళ్ళు ఇరు ప్రక్కల పెద్దల యేర్పాటు. కావున భర్త యిప్పడు తనయెడల నెంత విశ్వాసముతో వర్తించినను అతని మొదటి నడవడిని ఇరుగుపొరుగుల 'సఖీమణులు' తప్పక యామెకు వన్నెపెట్టి చెప్పియుందురు. అతనికి ప్రీతిపాత్రమైయుండిన యే సంత బసివి'నో చూపి, 'అదిగో ! నీ లెక్క లేని యక్కలలో నొక్కతె యుని వేళాకోళము చేసియుందురు. ఏమియు నెఱుఁ గని వారి విషయముననే వేడుకకో వెక్కసమునకో యిట్టి కథల నల్లి సంసారములు ధ్వంసముచేయువా రెందరో కలరు. అట్లుండ వేమనపంటి వాని విషయమున నడుగవలెనా ? పాపము ! ముగ్ధయగు నామె యిట్టి వానికి నన్నుఁ గట్టిరి గదా యని వగచి, ఎట్లైనను అతనికి తాను లోఁగియుండక, తన యాజ్ఞలో నతని నుంచి, యిల్లు కడప దాఁటనీక చేయవలెనని వారి బోధనల ప్రకారము యత్నించి యుండును. ఎత్తిపొడుపుమాటలు, బొమముడులు, అనాదర ణములు, మౌనముద్రలు మొదలగు అస్త్రశస్త్రము లెన్నియో యామె ప్రయోగించి యుండును. ఇ(క వేమన్న పట్టుకతో అగ్గిరాముఁడు! క్రొత్త పెండ్లికొడుకునకు ఇవన్నియు అలంకారముగానే తోఁపవచ్చునుగాని వేమన్న యివన్నియు ననుభవించి