పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన సంసార స్థితిగతులు 45

కావున సిద్ధాంత మేమనఁగా

 
           "తల్లి గలుగు లంజఁ దగులుట చీకాకు, విశ్వ." (3351)

ఇందుపై వ్యాఖ్యాన మనవనరము. ఇదికాక “సానిదాని పొందు సౌభాగ్య భాగ్యము' అని అచ్చున కెక్కని పద్యభాగ మొకటి గలదు (ఓ.లై, 14-4-42). ఇవి ప్రక్షిప్తము లనుకొని సంతోషించువారు సంతోషింపనిండు. ఒకవేళ నట్టెనను, వేమనవంటి మహాత్ముని కిట్టిభావము లంటఁగట్టినను అతని మహత్త్వమునకు కొఱ(త రాదని నమ్మినవారు, అంగీకరించినవారు ఉన్నప్పడు అతనికే యిట్టి భావములు జీవితమం దొకానొక సమయమందుండియుండుననుట యసంభవము గానేరదు, ఒక విషయము అసంభవము కాకపోవుటకును సంభవించుటకును నడుమ నంతరము చాల స్వల్పము. సాధ్యములగు విషయములు సిద్ధములగునని నమ్ముట కెక్కువ హేతువు లక్కరలేదు.

ఇంతదూర మీ విషయము చర్చించుటకు మీరు నన్ను మన్నింపవలసి యున్నది. కారణము గలదు. ఈవల మనలో, మహాపురుషులందఱు అన్నివిధముల దోష దూరులుగా నుండవలెనను బ్రాంతి, విమర్శకుల నావేశించుచున్నది. నన్నయ, పెద్దన మొదలగు వారు మత్సరగ్రస్తులై యుండిరనియు, శ్రీనాథాదులు స్త్రీలోలురై రనియు, కృష్ణదేవరాయలు మొదలగువారు క్రూరకర్ములైరనియుఁ జెప్పుకథలు నమ్మరానివని అసత్యములని ఆధునిక విమర్శకులనేకులు రాద్ధాంతము చేయు చున్నారు. ఇవి సత్యములైనను అసత్యములైనను ఆనంభవములుగావనియు, దోషసామాన్యము దగ్గఱ జేరనీకుండచేసిన పరిశుద్ధమహత్త్వము ప్రపంచములో లేదనియు, కావున ఒకరియందు దోషములుండవని సిద్ధాంతీకరించుటకు వారి యందలి మహత్త్వము మాత్రమే చాలిసంత హేతువు కాఁ జాలదనియు నామనవి. సహజముగా వచ్చునవి దోషములు. సాధింపవలసినవి సద్గుణములు. కావున వీనిని సాధించు లోపల అవి కొంతకుఁ గొంతయైనను తమ హక్కును జెల్లించుకొని తీఱుననుట సత్యము. అది యట్లుండె,

ఇట్లు ఇంద్రియపరవశుఁడైన వేమన యెంతదూరము వెళ్ళెనో చెప్పట కష్టము. కథ ఒక్క వేశ్యకధీనుఁడైయుండె ననుచున్నది. దాని సనుసరించిన పద్యమొకటి 'ఒక్క వెలయాలి పొందే మిక్కిలి సౌఖ్యమ్మటంచు మెలఁగితివేమా! (1673) యనుచున్నది. కాని వ్రాఁత ప్రతులలో

       "క, ఒకతెకు లోలత భ్రమయక
            నుకుమారుం డన్నిరుచులఁ జూడఁగవలెఁటో
            సకలవనంబులఁ దుమ్మెద
            మకరందముగ్రోలినట్లు మహిలో వేమా" (ఓ. లై., 11-6-24)

అను పద్యము గలదు. ఈ రెండు పద్యములును వేమన్నవి కావని తిరస్క రించినను, వేమనవని స్పష్టముగానుండు ఆటవెలఁదులలోనే, యితఁడేక ప్రియా వ్రతమును పాలించిన వాఁడు కాఁడనియు, ఇంద్రియచాపల్యమున, మాటల యందును ఆటలయందును సౌమనన్యమునుగాని, నియమమునుగాని, పాటించిన వాఁడు కాcడనియును బలమగు సందేహమును గలిగించునవికలవు. : ధీనులను తిరస్కరించి ఖండించు పద్యములే కాక, ఇతనియున్మస్తకమదనోన్మాద మును వెలిపుచ్చు పద్యములనేకములు గలవు. బ్రౌనుదొర యీ యసభ్యపద్యముల నన్నిటిని ప్రత్యేకముగా నేరి యొక కూర్పుఁజేసి వానికి ల్యాటినుభాషలోఁ గాఁబోలు,