పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                             వేమన     44

లనుభవించినవారు వారు. మనము వారి గుణములచేత, మహత్త్వముచేత మేలు పొందవలసినవారము. వేమన పరనారీ స హెూదరుఁడై, శుకమహర్షియపరావతారమై యుండి, యొక పద్యమును వ్రాయక యే మూలలోనో ముక్కుపట్టుకొని మురిగి యుండిన మనము నంతోషించుచుంటిమా ? మన్నించుచుంటిమా ? నన్నడిగిన వేమనవలె పద్యములు వ్రాయఁగలవాఁడెవఁడైన నేఁడు లభించునేని యతనికిఁ గావలసియున్న మనమందఱును చందాలెత్తి వేయిమంది వేశ్యలను సంభావన నమర్పింపవచ్చును.

మఱియొకటి చూడుఁడు : వేమన "జిహ్వచేత నరులు చిక్కి నొచ్చిరిగదా" (1603) యని పరితాపపడి దానికి లోఁగుట తప్పని చెప్పచున్నాడు. అనఁగా, పట్టిననాఁటినుండి యేది దొరికిన నది తిని, దొరకకున్న నుపవాసముండియే కాలక్షేపముచేసిన నిత్యోపవాసి యతcడని చెప్పవచ్చునా ? అట్టెన '" పప్పలేని కూడు పరుల కసహ్యము" ఇత్యాదులు వేమన్న చెప్పినవిగావా ? విషయలోలత్వమెల్ల నిట్టిదే. మఱియు, వేమనవంటివాఁడు కొన్నాళ్ళైనను విషయాధీనుఁడై యుండకపోవుటయే యసాధ్య మనుకొనుచున్నాను. ఇతని యుద్రేకము ఏ విషయమందు ప్రవర్తించినను చాల వేగము, వేఁడి గలది, తోఁచినపని చేయించుటయే దాని స్వభావము. దాని చేతనే వేమన యింతటివాఁడైనాఁడు. ఎక్కువ సందేహములు శంకలుగల మనుష్యులు గ్రంథములు వ్రాయుటకు పనికివత్తరేమో కాని కార్యములను సాధింపలేరు. మననుకు వచ్చినదానిని వెంటనే సాధింపఁ బ్రయత్నించువాఁడు పది పనులలో రెండైనను సత్కార్యములు చేయును. తక్కిన యెనిమిది యకార్యములు ప్రపంచప్రవాహములో మునిఁగిపోయి యా రెండే స్థిరముగా తేలును. అంతమాత్రముచేత నా యెనిమిదియు నతఁడు చేయలేదని కాని చేయఁజాలఁడని కాని ువాదించుట సాహనము.

మఱియు, కవిత్వము సంగీతము మొదలగు కళలకు లోఁగిన వారికి విషయ లోలత్వము తప్పనిదేమో! ఇది కొంత సాహస సిద్ధాంతమే యగును. కాని, హృదయమున జనించిన భావములను అడ్డఁగించుకోలేక బైట(బెట్టుట కళాధీనుల స్వభావము. కొంద ఱీతరులకు వెఱించి కొన్ని భావములను బైలుపఱుపక యడఁచు కొన్నను, ఆ భయము లేదని తెలిసిన వెంటనే స్వతంత్రముగ వానిని వెల్లడింతురు. కవులలో పచ్చి బూతులు వ్రాయువారు, గాయకులలో వానిని పాడువారు, చిత్రకారు లలో దిగంబరాది రూపములను చిత్రించువారు, చెక్కువారు, అట్టివానికి సంతసించి మెచ్చుకొనువారును అన్ని దేశములందును, అన్ని కాలములందును నీతి విలువ నెఱిఁగిన చదువరులే కలరు. ఈ స్వభావమే వారి వ్యవహారములందును వర్తించును. తోఁచినది చెప్పకపోవుట యెంతకష్టమో తలఁచినది చేయకపోయుటయు నంతే కష్టము. ఇందు న్యాయాన్యాయముల, ధర్మాధర్మముల విచారణకెక్కువ చోటులేదు. సహజమైన రసార్ధ హృదయమును నియమజ్యోతిచే గట్టిచేసికొన్న వా రనేకులు గలరుగాని వారట్లు గట్టిపడుటకు మొదలు కేవల రసపరవశులై హృదయదాసులైయే వర్తించి యుందురు. ఇందు కపవాదములు కలవు కాని మృగ్యములు.

పైవి యనుమానములు మాత్రమేకాక వేమన వేశ్యలస్వరూపమును చక్కగా నెఱిఁగినవాఁడని యతని పద్యములే ఫెూషించుచున్నవి. ఒక్క పద్యమునైన నుదాహరింపక విధిలేదు. మన్నింపుఁడు.

       "ఆ. లంజ లంజకాని లావెల్ఁల గొనియాడు
             లంజతల్లి వాని లజ్జ గడుగు"