పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                       వేమన కాల దేశములు 33

మఱుఁగుపఱుచునంత దట్టముగ ముదిరి బలిసినదని నేనింకను అనుకొనలేదు. అస లిటువంటి అవాంతర భాగములం దభిమానము కృత్రిమమే కాని సహజము గాదని నా మతము. ఆభిమానమను పేరుతో, పిల్లులకు దొరకిన పెసరయుండను పంచిపెట్టవచ్చిన కోఁతివలె, పరిపూర్ణమైన వస్తువును ప్రక్కలు కొఱికి తినుట యిప్పటి నాగరకత దుష్ఫలములలో నొకటి. ఇట్లే చేయుచుండినచో పూర్తిగా అసలే "నశించువఱకు ముగింపుండదు, వేమన యాంధ్రుఁడని యెఱి(గి తగిన మర్యాదను చూపఁగల్లితి మేని మన యభిమానమునకుఁ జాలును. అట్లుగాక మాదత్త మండలముల వాఁడని, మా యనంతపురము జిల్లావాఁడని, మా కళ్యాణదుర్గము తాలూకా వాఁడని, మా రాళ్ళపల్లివాఁడని, అందును మా యింటనే పట్టిన వాఁడని, ఉల్లిగడ్డ పొరల వొలుచుచుఁబోయిన, తుదకు నేనే వేమన్న యనుకొనవలసివచ్చి శూన్యము శేషించును! కావున వేమన దత్తమండలముల వాఁడని సామాన్యముగ నే నూహించుటకు అతఁడట్టివాఁడుగాc గాసవచ్చుటయే తప్ప వేఱు కారణమేదియు లేదని విన్నవించుచున్నాను.

అట్లు కానవచ్చుటకు కారణము లిదివఱకే కొన్ని సూచించితిని. ఇదిగాక ! గండికోట నితఁడు పేర్కొన్నాఁడు [1247], నంది దుర్గమును జూచినాఁడు [392]. కడపజిల్లా జమ్ములమడుగు తాలూకా ముడియమను గ్రామములో వేమన శిష్యుల పీఠము గలదcట 'యోగాభ్యాసము వారి వృత్తి ; ఇట్టి వారీమండలమున నూఱు కుటుంబముల వఱకుఁ గలరు" అని శ్రీ కావ్యతీర్థ జనమంచి శేషాద్రిశర్మ గారు నాకు వ్రాసిరి. ఇట్టి మఠము గండికోటలో నొకటి కలదఁట ; పామూరను గ్రామము వద్ద కొండగుహలో వేమన కడసారి ప్రవేశించినట్లు కల వాడుకను మొదలే తెల్పితిని గదా ! వేమన దక్షిణదేశమంతయు ఇంచుమించుగా సంచరించినాఁడని తలఁపవలసి యున్నది నిజమే ; అరవదేశమునఁ గూడ నితఁడు మఠములు స్థాపించినాఁడని వదంతి. ఎంతవఱకు నిజమో చెప్పలేను. తంజాపూరి రాచనగరులో వేమన్న చిత్రపటమున్నదంట. కాని దత్తమండలములలో వేమన కున్నంత ప్రచారము తక్కినచోట్ల నున్నట్లు కానరాదు. ఇప్పటికిని 'వేమన్న' యను పేరు గలవారీ దేశమందెందఱో కలరు.

మఱియు, వేమన వాడిన ఈ క్రింది పదములు చూడుఁడు : మంకు (364) తారాడు (190) సంబళము (139) సొడ్డు (468) కళవళము (939) కూయు [1116] చాడి [1504] దుడ్డు (వే.1143) తాళిక (2114) బిత్తలి [2552] ఇత్యాదులు కన్నడ సీమకు సమీపమగు తెలుఁగు దేశమందే వాడుకలోc గలవు. మఱియు ఆకు వక్క (220) బైసి (396) వలికి [673] ఒక్క పొద్దు (792) రుద్దు (1116) పీకు (1125) కుళ్ళుపోతు [1147] మొదలగు శబ్ద ములు నల్లమల కీవలివారికి తప్ప ఆవల వారి కర్థమగునా యునియే నా సందేహము. వీనికితోడు కుంక (1033) చెంబడి (880) ఊ(క (549) వంటివి, ఈ దేశమున వాడుకలేని పదములు అపురూపముగాఁ గలవు కాని, యివి వేమనవంటి దేశ దిమ్మరికి వచ్చుట వింతగాదు,

ఇదిగాక వేమన బసివిరాండ్రను పలుమాఱులు పేర్కొని యున్నాఁడు. బసవ శబ్దము వృషభశబ్దపు కన్నడము. శివదేవాలయములకు కుఱ్ఱదూడను వదలిపెట్టుట, అది స్వేచ్చగా నెవరితోఁటలలో మేసినను నహించి యూరకుండుట, దానిని పూజిం చుట-కన్నడశైవల సంప్రదాయము. దానిని వారు బనవుఁడందురు. అట్లే యింటిలో