పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                           వేమన.     32

కొన్నాళ్ళలోపుననే వేమన మరణించియుండునని శ్రీ ప్రభాకరశాస్తులవారి తలఁపు.

          “గజపతింట గ్రుడ్డిగవ్వలు చెల్లవా" (91)
         "గ్రద్దవంటివాఁడు గజపతిగాదొకో" (వే.జ్ఞా. పద్యములు, 780)

అని వేమన దూషించిన గజపతుల ప్రాబల్యము 17వ శతకపు పూర్వభాగ మందే కావునను, సుమా రిస్నూ రేండ్ల వయసుగల వ్రాఁతప్రతులు తంజావూరి గ్రంథాలయములో నుండుటచేతను, వేమనను 17 వ శతకపు తుదికీడ్చుట సాధ్యముగాదని వారి వాదము. ♦[1] కాని బండారు తమ్మయ్యగారు వేమన 17 వ శత కాంతము వఱకును బ్రతికియుండెనని యూహించుచున్నారు. గుంటుపల్లి ముత్త మంత్రి గోలుకొండ నవాబగు మహమ్మదల్లి పాదుషాయధికారము క్రింద కొండవీటి సీమకు అమీనాగా నియమింప(బడినవాఁడు కావున, అతని కాలమునందు *షేకు సైదు" అను పద్యము చెప్పనవకాశ ముండదనియు, ఈ పద్యమునాఁటికి తురకలదొరతనము నశించిన దనియు వారి వాదము.*[2] బ్రౌనుదొర, వెనుక(జెస్పి సట్టు వ్రాఁతప్రతిలో 17-వ శతకపు తుదలోను 18 వ శతకపు టాదియందును ఉన్నాడని వ్రాసికొన్నను అచ్చు ప్రతి పీఠికలో "పదునేడవ శతాబ్దపటాదియందు ఇతఁడున్నాఁడని నమ్మెదరు' అని తిద్దుకొనెను. †[3]

నాకుఁ జూడఁగా 18 వ శతాబ్ది యూదియందు వేమన్నయుండెసని యూహిం చుట యనుకూలముగాఁ దోఁచుచున్నది. తాటాకుల పుస్తకముల వయస్సు నిర్ణయించుట కష్టము : గజపతులకథ, ముత్తమంత్రి మరణము మొదలగుసవి విని యైనసు వ్రాయపచ్చును. కాని 1780లో జనించిన కటార్లపల్లె పుల్లారెడ్డి తాను వేమస యపరావతారమని చెప్పకొనుటకును, ప్రజలు, అందును వ్రాఁతచదుపులు రానివారు, దానిని నమ్ముటకును, వేమన మఱుఁగు పడి చాల సంవత్సరములై యుండిస సాధ్యముగాదు. కావున ఆ వేమన్న సమాధికాలమును ఈ వేమన్న జనన కాలమును ఎంత సమీపమందున్న నంతమేలు. కాని, వంగూరి సుబ్బారావుగారు వేమననెంత పై కీడ్చిరో నేనంత క్రిందికీడ్చు న్నానేమో యను భయము నాకు లేకపోలేదు. ఐనను మనచరిత్రములెల్ల చాలవఱకు ఊహాప్రపంచమునకుఁ జేరినవో కాన, ఇన్ని యూహలజతలో నాదియు నొక యూహయండిన నంతేమి బరువు గాదనుకొనుచున్నాను. ఇంతకన్న దీనికెక్కువ సత్యత్వము నిచ్చుటకు నాకధి కారము లేదు.

ఇట్లే వేమన యొక్కువగా వసించిన స్థలమునుగూర్చియుఁ గొంత యూహింప వచ్చును. వావిళ్ళవారి ముద్రణపు పీఠికలో, ఇతఁడు దత్తమండలముల వాఁడనుట న్యాయ్యమని ప్రాసియుంటిని, దత్తమండలములనఁగా, కదిరి త్రాలూకా యిప్పడనంతపురమునకుఁ జేరుటచేత ఈ జిల్లాకును కొంత వేమన ప్రసాదము దొరకిన శాస్త్రమైనదే కాని, యంతకుముందు, అసంతపురము బళ్ళారిజిల్లాల కితని సంబంధము కానరాదు. కావున నితఁడు కడప కర్నూలు జిల్లాలవాఁడని బౌ)ను, కాంబెలు మొదలగు వారివలె నేనును తల(చితిని. దానికి నా స్వదేశాభిమాసమే కారణ మని శ్రీ పం. సుబ్బారావుగారు తలంచిరి. నా స్వదేశాభిమానము సత్యమునే

 1. ♦ ఆంధ్ర, సం. సంచిక, క్రోధన,
 2. *ఆంధ్ర, అక్షయ, సంచికి.
 3. † See Brown’s Vemana, Preface III.