పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                       వేమన కాల దేశములు    31

       "ఆ. మక్కకుఁ జననేల మగుడఁ దా రానేల
            యేకమైన చిత్తమెందుఁ గలదు,
            అన్నిటఁ బరిపూర్ణ మల్లా మహమ్మదు, విశ్వ."* [1] (2879)

అని ధైర్యముగా మహమ్మదీయులకును మతబోధచేయ సాహసించినవాఁడనియుఁ జెప్పవచ్చును.

మఱియు, వేమన వైష్ణవఖండన చాలతీవ్రముగాఁ జేసినవాఁడు. ఆంధ్రదేశమున వైష్ణవమతము కృష్ణదేవరాయల తరువాతనే కొంత వేఱూఱినది. ప్రాచీనమైన శైవ మతమును రాజాశ్రయబలముచే నెదుర్కొని జనసామాన్యమును వైష్ణవులనుగాఁ జేయఁబ్రయత్నించినవారు తాతాచార్యుల వంశమువారు. వీరి కాలముననే మాలలు మొదలు రాజులవఱకు నీ దేశమున నించుమించుగా సామాన్యజనులు ముక్కాలు మ్మువ్వీసము వైష్ణవులయిరి. తాతాచార్యుల వీఁపుముద్రల మంట మనవారింకను మఱవలేదు. వెంకటపతి రాయల కాలమున వీ రేర్పఱచిన నామధారిమతము స్థిర మైనది. దాసరులు, సాతానిపురుషాకారులు, బసివిరాండ్రును-వీరివలస నిర్ణయింపఁ బడిన మర్యాదల నిప్పటికిని అనుభవించుచున్నారు. వేమన్న కాలమున కీవైష్ణ ప్రాబల్యము పరమార్థ దృష్టిలేక, పరార్థదృష్టిగలిగి కేవలము వేషముక్రిందికి దిగి నట్లున్నది. మతము పేర నెన్నియో యకార్యములు చేయుచుండిరి.

       'ఆ, ఎంబెరు మతమందు నెస(గ మాంసముదిని
            మాఱుపేరుపెట్టి మధుపత్రావి
            వావి వరుసదప్పి వలికిపాలౌదురు, విశ్వ."

                                         (వేమన జ్ఞానమార్గపద్యములు, ద్వి. భా, 14)

     " ఆ రంగధామమునకు హంగుగా తానేగి
            కల్లుకంపుసొంపఁ గల్గియుండు. . . ." (ఓ. లై., 13-3-39)

బ్రౌను దొర కాలమువజకును ఈ యకృత్యములు వెస్తవులు చేసెదరను భావము అనువర్తించిపచ్చినది. పైరెండవ పద్యమునకు టీకలో 'వైష్ణవులు పూజ నయినపుడు కల్లుత్రాగుదురు" అని యతఁడు గుర్తవ్రాసికొన్నాఁడు! దీని సత్యాసత్య నిర్ఱయము ప్రకృతవిషయముగాదు. అన్ని మతములు మొదలు మహెరాదారాశయ ములతోనే బైలుదేరినను, క్రమముగా దానివేఁడి యాఱిన వెంటనే సహజములైన యింద్రియచాపల్యములు ప్రబలించి, మనుష్యులు తమ తప్పలను సమర్ధించు కొనుట కామతములనే యుపయోగించి పతితులగుట యన్నిదేశములందును అన్ని కాలములందును గలదు. అట్టి యవస్థకు కొంతకాలమైసను పట్టునుగాన, పదు నా ఱవశతాబ్దపు మొదట వ్యాప్తికి వచ్చిన వైష్ణవమతముసకు పై దురవస్థ పదునేడవ శతాబ్దమందే కలిగియుండపచ్చునని యూహింపవచ్చును. 1923లో మరణించిన ముత్తమంత్రి నెఱిఁగినవాఁడు గావునను, వేమన్న యా శతకమధ్యభాగమునకన్న వెనుకనుండి యుండ(డు.

ఇఁక పదునేడవశతకపుటాదియందే, ఆనఁగా, ముత్తమంత్రి మరణించిన

 1. * ఈ పాఠమే వ్రాఁతప్రతులందెల్లఁ గలదు. మహమ్మదు అల్లా కాఁడవి యెటిఁగిన యాధునికులు 'అల్లా మహాత్ముండు" అని తిద్ధిని, కాని సామాన్య మహమ్మదీ యుల పాలికి మహమ్మదే ఆల్లా, వేమనకింతకన్న నెక్కువ *ఇస్లాము? మతజ్ఞానము * గలుగ నవకాశములేదు.