పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 30

అని చెప్పకొన్నవాఁడు. మఱియు, ఎఱ్ఱాప్రెగ్గడ వంటి విద్వత్కవులు వేమన్నను కవియని పొగడి రనుకొనుట సాహనము. ఇతని కవిత్వమునందు చదువుకొన్న వారి కిని గౌరవము నేఁడు కలుగుచున్నది గాని పూర్వకాలపు పండితులకుఁ గలదని నేను నమ్మఁజాలను. వారికి, ముఖ్యముగా 15, 16వ శతకములందు, కావలసినవి, శ్లేష యమకముల జిత్తులు, కల్పనాకవిత్వపు గత్తులు. అట్టివారికి యతిప్రాసభంగములు గలవి, ఛందస్సు దారితప్పినవియగు 'ఉప్పుకప్పురంబు' వంటి చప్పిడి పద్యములు తలకెక్కునా? కావున మన వేమన వారిదృష్టిలో శైవుఁడునుగాఁడు; కవియును గాఁడు; వారితనిని బొగడను లేదు. ఇక ఆ వేముఁడెవ్వఁడంటిరేని, పండితారాధ్య చరిత్రమున వర్ణింపఁబడిన చేటలవేమయ్యగాని, బెలిదేవరవేమనారాధ్యుఁడుగాని కావచ్చుననియు, ఈ రెండవవాఁడు శాపానుగ్రహసమర్ధుఁడగు కవియైయుండెననియు *[1] శ్రీ బండారు తమ్మయ్యగారు వ్రాసిరి. వంగూరి సుబ్బారావుగారును ఈ వేమన్నల నెఱుగుదురు.†[2] కాని వేమన్న కాలమును గూర్చి తమప్రాఁత నిర్ణయము మార్చు కొనఁ దల(పలేదు !

ఇదిగాక మన వేమన మహమ్మదీయుల రాజ్యకాలమున హిందువు లనుభ వించిన కష్టములు బాగుగా నెలిఁగిసవాఁడు---

        “క. పసరపు మాంసముఁ బెట్టియు
            మసకల సులతాను ముసలి మానులఁ జేసెస్" (ఓ. లై., 11-6-14)

      "ఆ. రాళ్ళు నమ్మియున్న రాజాధిరాజులు
           కూటి కెడలి భువిని గూలిచనిరి ;
           రాళ్ళు పగుల( గొట్టి రాక్షస పుత్రులు
           మాళ్ళు నూళ్ళగలిగి మనిరివేమ". (ఓ.లై. 21-1-30)

     " ఆ లింగమతములోన దొంగలుగా(బుట్టి
           యెుకరినొకరు నిందనొసరఁజేసి
           తురకజాతిచేత ధూళియైపోదురు, విశ్వ" (ఓ. లై.,13-3-39)

వేమన ముఖ్యముగా సంచరించిన పశ్చిమాంధ్రదేశములో మహమ్మదీయుల కాస్వాతంత్ర్యము విజయనగర వినాశానాంతరమే సంభవించును. మహమ్మదీయులు ప్రభువులుగా కడపసీమయందున్న కాలమున, అనఁగా 17వ శతాబ్దము యొక్క కడపటిభాగమం దితఁడుండినవాఁడని బ్రౌనుదొర గూడ తల(చెను (చూ, ఓ.లై,12-1-34; వ్రాఁతప్రతి పీఠిక). మఱియు నితని కాలమందు మహమ్మదీయుల యుచ్చాయస్థితి చాలవఱకు తగ్గియుండెననియు నీకింది పద్యముచే నూహింప చచ్చును—

      "ఆ. షేకు నైదు మొగలు చెలఁగు పఠానులు
           తురకల దొరతనము తొలుతఁజేసి
           రాఁగరాఁగ విడిచి రైతులై కొలిచిరి విశ్వ" (З765)

కావుననే -

  1. * చూ, ఆంధ్ర పత్రిక, రక్తాక్షి సంచిక.
  2. † చూ, వం. సు. వేమన, పు.201.