పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన కాల దేశములు 29

           "అ. ప్రాకటముగ నిట్టిలోకములో గంటి .
                 పల్లెముత్తఁడెన్నఁ బరమ గుణుఁడు,
                 అన్నదానముసను హరు పూజ చేతను
                 హరునిలోన ఐక్యమాయె వేమ?" (ఓ. లై.,13-3-39)

సుప్రసిద్ధ దాతయైన యీ గుంటుపల్లి ముత్తమంత్రి -

          " క, పొందుగ శరజల నిధిహరి
                చందనతరు చంద్రసంఖ్య శక పర్షంబుల్
                దుందుభినాపాడంబున
                నెందముగా వీరముత్తఁ డరిగెన్ దివికిస్"

అను చాటుపద్యము ప్రకారము క్రీ.శ. 1623లో మరణించెను. కావున నీ పద్యము వ్రాసిన వేమన 17వ శతాబ్దిమధ్యమందలివాఁడగును. అంతకు పూర్వఁడు కాఁజా లCడు. పై గుంటుపల్లి ముత్తమంత్రి పద్యము బందరు ప్రతిలో ‘లోకమందును గంటి బల్లెముత్తఁడు' అని ప్రకటింపఁబడి యుంట పొరబాటే. నేనును మొదలు గంటిపల్లె ముత్తఁడనియే తలఁచితిని, కాని, ప్రాచ్యలిఖిత పుస్తకశాలలోని రెండు వాఁతపతులలో

           " రీతైన సందవరీకులలో చాల
             గుంటుపల్లి ముత్తన్న గుణగరిష్ణుఁడు" (ఓ.లై, 13-9-22; 11-6-25)

అను పాఠముతో పై పద్యము గలదు.♦[1] యతిస్థానమందుండుటచే పద్యము యోగ్యత యెట్టిదైనను, పేరు నిస్సందేహముగదా. కాని వంగూరి సుబ్బారావుగారు వేమన కాలము నిదివఱకే నిర్ణయించుకొన్నారు గావున దానిని మార్చుకొన నిచ్చలేక, ఈ పద్యము ఏ భట్రాజులో వేమన మకుటమున కతికించిన ప్రక్షప్త మనుకొని తృప్తి పడిరి. * [2]ప్రక్షిప్తము గాకున్న పదునారవ శతకమందే వేమనను ఇతరులు పొగడుట సంభవించునని వారి ప్రశ్న. కాని ప్రత్యుత్తరము లేకపోలేదు. పై యెడపాటి యెఱ్ఱాప్రగడ మొదలగువారు, పాల్కురికి సోముఁడు, భవదూరుఁడు మొదలగు శైవాగ్రేసరులగు కవుల నడుమ వేమనయను పేరుఁ జేర్చియున్నారు.†[3] వేమన వేమన శైవప్రపంచంలో పుట్టిపెరిగినవాఁడే కాని కడకు త్రిమూర్తలను తోసిరాజని శుద్ధ ద్వైతిగా మాఱినవాడు వాఁడు. "హరిహరాదులందు నాసవిడిచి (372) న వాఁడు మాత్రమే కాక.

 
         "ఆ, బ్రహ్మవ్రాఁత కెదురు పల్కెడు వాఁడును
              ఆది విష్ణు సూత్రమడఁచు వాఁడు,
              మూఁడు కనులవాని మొనసి నిల్చినవాఁడు,
              కాసఁబడరు నీవు కాని వేమ" (ఓ. లై., 12-1-30)

  1. ♦ పై ప్రతులలో నీ పచ్యమునకు మొదలీ క్రింది పద్యములు గలవు :

    "సర్వజ్ఞ సింగన్న నంతరించిన ధనము పరగ భూమి పాలు పరుల పాలు
    సరగ పెదవేమన్న సంతరించిన ధనము సురభూసురుల పాలు చూడువేమ"

    "పరగ రాయనిమంత్రిబాచన్న ధన మొల్ల భటకవియాచక పరుల పాలు
    సరగ శ్రీనాథుఁడు సంతరించిన ధనము వారజారస్త్రీలపాలు వేమ"

  2. * చూ, శతక కవుల చరిత్రము. పు, 79,
  3. † చూ, వం, సు, వేమన, ప. 39 నుండి పు, 41 వఱకు