పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన కాల దేశములు 25

నిచ్చినది తప్ప నాకేమియు ఫలము లేదయ్యెను. అది యట్లుండె,

నల్లచెఱువు చెన్నయ్య చెప్పిన కథయంతయు నొక్కటితప్ప సత్యమని యిక్కడివారందఱు సంగీకరించిరి. అదే దనఁగా, కొండవీటిసంబంధము. 'నెల్లూరు మొదలగు ప్రాంతములందు ఆ వేమన్నభక్తు లనేకు లున్నారు. కావున వారు వేమన్నపేర నిచ్చు వర్ణాశనాదులను సంపాదించుటకును, మర్యాద లనుభవించు టకును ఈ వేమన్నవంశీయులమగు మేము, ఇరువురు నొకటేయని యిట్లు కొండవీటి ముడి వేసికొన్నామే కాని వేఱుకాదని కటార్లపల్లె వేమన్నవంశీయుఁడగు చెన్న రాయఁడు సంకోచించినను స్పష్టముగాఁ జెప్పెను. ఈ సత్యప్రీతి కతనిని మన మభి నందింపవలసియున్నది. మన వేమన్నకు కటార్లపల్లె సంబంధమున్నను, లేకున్నను కొండవీటిసంబంధము మాత్రము గలదని యిక్కడివారును నమ్మియున్నారనుట యొక ముఖ్య విషయము.

ఈవేమన ఆ వేమన కాఁ డనుటకు వేఱొక ప్రబలాధార ముస్నది. అదే తాటాకుల పుస్తకమున అతని ననుసరించి యితఁడు వ్రాసిన ఆటవెలది పద్యములు నూటికి పైబడి కలవు, వాని మకుటము "బాలచక్రవేమ భవ్యనామ' యని, అర్థ మడుగకుఁడు. అది నాకుఁ దెలియని యనేక రహస్యములలో నొక్కటి. 'పఠనరామ" యునియు, 'బౌద్ధరామ' యనియు పాఠాంతరములు గలవు. పై పద్యములలోఁ గొన్ని 'విశ్వదాభిరామ' మకుటముతో ఆ వేమన్న పద్యాలతో సంగమించినవి. లేక ఆ వేమన్న పద్యములకె మకుటముమార్చి యిందులోఁ బేర్చినారేమో! ఒకటిరెం డుదాహరింతును----

           "ఆ, ఆది త్రిమూర్తులు ఆత్మలోనున్నారు
                 బంధించి తెలిపితో బయటపడును
                 హృదయమందు గురుని పండ జూడగలేరు, బాల."

           "ఆ యాత్రటోయినవాఁడు యెన్నాళ్ళు తిరిగినా
                పారమైన ముక్తి పదవిలేదు.
                మనసు నిలిపినవాడు మహనీయమూర్తికా, బాల." *[1]

ఈరెండవ పద్యము మకుటభేవముతో వేమన సూక్తిరత్నాకర మందున్నది (3245)

ఈ తుంగ వేమన్న జన్మకాలమును దెలుపు పద్యమొకటి యా పుస్తకమం దొకచో వ్రాయబడి యున్నది.

             వలనొప్ప తుంగాస్వవాయ పావనమూర్తి కేశవనామ కుశేశయాక్ష ?
             రమణిపాలిక శ్రీలరంజిల్లు లక్ష్మాంబకును అగ్రతనయుఁడై కొమరుమిగిలి
             ఘనతర రాజయోగ స్పూర్తి శార్వరి సంవత్సర చైత్రశుక్లపక్ష నవమి
             శాలివాహన శతాబ్ధములు వేయునార్నూఱొకనూరు వెసను రెండు
             పరగ మిగిలినదినము శ్రీ బాలచక్ర, వేమనార్యండునను భవ్యనామ మము
             ఆది శ్రీ లక్ష్మనారాయణావతారమైన శ్రీ చెన్నరాయుఁడై యవని వెలసె"

ఇందుచే నితఁడు శా.స. 1702వ శార్వరి సంపత్సరమున (క్రీ.శ. 1780) చైత్ర శుక్ల నవమినాఁడు జనించెను. ఇతనితల్లి లక్ష్మమ్మ సిద్ధార్ధీ సంవత్సర పుష్య

  1. *ఈతని పద్యము సుమారు ముప్పదివఱకు. మచ్చుకు శ్రీ కదిరి వసంతాచార్యులు
    గారు నాకు వ్రాయించి పంపి నా కృతజ్ఞతకు పాత్రులైరి.