పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన కాల దేశములు 21

నావంటివానికి వేమన జీవితమును దెలిసికొనవలెనన్నప్పడు కలుగు కష్టము చెప్పి తీఱదు. ఐనను ఈ రెంటిని యధాశక్తి పరీక్షించి ప్రకృత ముపయోగించుకొనవలసి యున్నది.

వేమన సూక్తిరత్నాకరమున పీఠికలోని వేమన చరిత్రమను పురాణమున ఈక్రింది విషయములు గలవు : క్రీస్తుశకము 1328 నుండి 1428 వరకును నూరేండ్లు సరిగా కొండవీటిలో రాజ్యముచేసిన రెడ్డిరాజులలో కడపటివాఁడగు రాచ వేమారెడ్డికి మన వేమన తమ్ముఁడు. కొమరగిరి వేమారెడ్డి కొడుకు. తల్లి మల్లమ్మ. అన్న భార్య, తల్లివంటిది, సరసాంబ. వేమన చిన్ననాఁటినుండి వేశ్యవలలోఁ జిక్కి యుండి బొక్కసమంతయు దానికి దోచిపెట్టుచుండఁగా, వదినె సరసమ్మ యు క్తితో నాతనికి దానిపై రోఁతజనించునట్లు చేసెను. నగరి కంసాలి అభిరామయ్య. అతఁడు లంబికాశివయోగియను వానిని తత్వోపదేశార్థము రహస్యముగా సేవించుచుండెను. ఒకనాడా యోగి అభిరామయ్యతో రేపుదయమువచ్చి యుపదేశముపొందుమని చెప్పఁగా దానిని పొంచివిన్న వేమన్న, మఱునాఁడు అభిరామయ్యను బలవంతముగా నగరియందే నిలుచునట్లుచేసి, తాను పోయి యోగితో 'అభిరామయ్య తాను రాలేక నన్ను పంపినాఁడు" అని చెప్పఁగా 'వాఁడు నిర్భాగ్యుఁడు, నీవే రారా' యని యతఁడితనికే యుపదేశముచేసి యెందో పోయెను. జ్ఞానియై వేమన్న యభిరామయ్య క్షమాపణ వేఁడి, విరక్తుడై దేశదేశములుఁ దిరిగి పద్యరూపముగ తత్త్వాపదేశము ప్రజలకు చేయుచు, తుదకు ' కటార్లపల్లె ' లో సమాధివిష్ణుఁడయ్యెను.

ఇందు చరిత్రమునకు ముఖ్యవిషయములగు పంశము, కాలము, దేశము పేర్కొనఁబడినవి : కోమటి రెడ్డిరాజుల వంశీయుఁడు; 14 వ శతాబ్దమున నున్న ; కొండవీటిలోఁ బుట్టిపెరిగి కటార్లపల్లెలో ముక్తుఁడైనవాఁడు. దీనిని వ్రాసిన ఇది “నిక్కపు చరిత్ర' యనుచున్నారు కాని యే యాధారములచేత నిది నిక్కమనుకొనిరో తెలియదు. మతయు, పై వంశవృక్షమును సుగృహితనాములగు కీర్తి | శే| కొమఱ్ఱాజు లక్ష్మణరావుగారు అసత్యమని ఖండించిరి. వేమన్న తండ్రి యనఁబడు కొమరగిరికి సంతానమే లేదట. కావున నతని తరువాత నతని దాయాది యగు కోమటి వేమారెడ్డి రాజ్యము చేసినవాఁడు. కొమరగిరిరెడ్డికి కొడుకనఁబడు రాచవేమారెడ్డి ఈ కోమటివేమారెడ్డి కొడుకcట ! వేమనయోగి కిం దేసంబంధమును ఉన్నట్లు కానరాదట.*[1]

శ్రీ చిలుకూరి వీరభద్రరాపగారు కుమారగిరికి కుమారుఁ డున్నట్లు శాసనాదుల వలన తెలియవచ్చుచున్నది యనిరి.†[2] కాని యతఁడు రాజ్యమునకు రాలేదు. ఈ రాజ్యమునకు రాని కుమారుఁడే బైరాగుల సావాసమునఁ బడిపోయిన మన వేమన్న యైయుండునా యను సందేహము గలుగును. కాని "వేమన వాక్యము" లనఁబడు వానిలో వేమన తండ్రి‡[3] 'రెడ్డన్న' యని చెప్పఁబడినది. ఇట్లే బందరుప్రతిలోని వేరొక వచనమందును గలదు (390). కుమారగిరివంటి ప్రభువుకు రెడ్డన్నయను సామాన్యనామ ముండునని యూహించుట యసాధ్యము. మణియు "వేదాంత సిద్ధాంతము " పీఠికలో కొమరగిరికి కొడుకు లిద్దఱనియు, వారిలో రాచవేమారెడ్డియే

  1. * చూ, వం, సు. వేమన, పు. 65.
  2. †ఆంధ్రుల చరిత్రము, భౌ, 3 పు 190
  3. ‡ చూ, ఘటశోధని, పు. 48.