పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

20

వేమన

కారులు, తమజాతియే సర్వగుణముల కాకరమై తమ మతమే సర్వమతసారము ; తమదేశమే వీరశూరవిక్రమాదిత్యుల ...... తమభాషయే ముద్దుపలుకుల మురిపెములమూట, యని వ్రాయుచు, ఇత..... * రించుచు, విధిలేక ప్రపంచమున వారిబ్రతుకు నోర్చియుందురు ! కన్న ..... * కవిత్వ మును వ్యాకరణమును, ఛందన్సును—ఇంతయేల? అ ఆ ఇ నేర్పిన యుపాధ్యాయు లాంధ్రులనియు, అరవము 'వినుటకు శ్రుతి క...... డు బొమ్మరాళ్ళతంబళము" అనియు మనవారు వ్రాసికొన్నారు. (చూ ఆంధ్రవాజ్మయ చరిత్రము, పీఠిక XXXIV; పే. 120). అరవమందు, మందును మళయాళమునుదును గల ' ழ ' కారము తెలుగునఁ గూడ యుండెనని యెవరైనఁ జెప్పిస నెదగ్రుద్దుకొనువారు మనలో నున్నారు. ఇది. ఆంధ్రులలోనే బ్రాహ్మణాహ్మణులరగడ, సర్కారు దత్తమండలముల వివాదము నియోగి వైదిక భేదము-మొదలగు పాక్షికవ్యవహారములచేత నెన్ని యసత్యములు అన్యాయసిద్ధాంతములు బైలుదేలిఱినవో, దేఱుచున్నవో, మీ రెఱుఁగుదురు. నన్నయ కవిత్వమునం దున్నంతమాధుర్యము తిక్కస కవితయందు లేదని యొకానొక వైదిక పండితులు నాతో వాదించిరి! కాని యిటీవల నన్నయ అసలు బ్రాహ్మణుఁడే కాదు క్షత్రియుఁడని యొుక వాదము బ్రెలుదేఱుచున్నట్లు జ్ఞాపకము ! నన్నయ బ్రాహ్మణుఁడైన నేమి, క్షత్రియుఁడైన నేమి, మన కేమిలాభమని తలచిన కొందఱు, కాపువారు కా(బోలు, నన్నయకుఁగల యాదికవిత్వకీర్తిని వేమన్న కీయఁదల(చి వేమన్న నన్నయకన్నఁ బూర్వుఁడనిరఁట ! (వం.సు. గారి వేమన, పు. '45). ఇట్లే రామరాజభూషణుఁడు బ్రాహ్మణు(డే కాని సూద్రుఁడు కాఁడను వాద మొకటి గూ(డ నా చెవిని బడిసది.

తమ యభిమానపు వాదమున కనుకూలమగు పూరిపడకనైనను బ్రహ్మాస్త్రముగా భావించుటవిరుద్ధములైన సాక్ష్యముల నన్నిటిని సందేహించి తిరస్కరించుట, యేదైనను నూతనసిద్ధాంతమును తప్పక బైటికిఁ దీయపలయునను సంకల్పము— ఇవి యూధునిక చరిత్రకారులలో ననేకుల మనస్తత్త్వములు. కాళిదాసు తస గ్రంథములలో నందందు "గుప్త పదము వాడుటచేత నతఁడు గుప్త రాజుల కాలము వాఁడని సుప్రసిద్ధ చరిత్రకారులకు ' కీతు ' గారు వాదించిరి ! (See the Journal of Royal Asiatic Society, 1909, p. 438) ఒకానొక యాంధ్రచరిత్రకారులు ద్రోణాచార్యులు కుంభసంభవఁడనుట కర్ధము ఆతఁడు కుమ్మరివాఁడై యుండుసని తల(చిర(ట ! అంతదూరమెందుకు? పేరు సవ్వఁడిబట్టి అతఁడు దోcణినడుపు బెస్తవాఁడనియు, ధర్మరాజు దొమ్మరి వాఁడనియుఁగూడ జెప్పవచ్చునుగదా !

ఇట్లు మన చరిత్రములు విచిత్రసిద్ధాంతముల కాకరములై యుండుటకు ముఖ్యకారణము మనలో చరిత్రరచనకు పనికివచ్చు బహిరంగ సాధనము లెక్కువగా లేకుండుటయే. ఉన్నవి యతిశయోక్తిమయములైస పురాణములు. ఇంక అంతరంగ సాధసములు అనుమానముసకు పనికివచ్చునే కాని, దృఢమైన సాక్ష్యమును సమ కూర్పునవి యేగ్రంథములందును ఉండవు, తమ చరిత్రమును ముందు వ్రాయువారికి పనికిరావలయునను నుద్దేశముగలవారు తప్ప, తక్కిన యెవరును స్వకీయ చరిత్ర విషయములకు తమ గ్రంథములలో నవకాశమివ్వరు. అవి ఆకస్మికముగా నందు రావలసినవి.

ఇట్టి యిరువురినడుమ పురాణమును, చరిత్రమును, దేనిని వ్రాయనేర్వని