పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/135

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
               వేమన కవిత్వము, హాస్యము, నీతులు  129

మనుష్యుల కీలోకమందు నెమ్మదిగా బ్రదుకుట కావశ్యకములగు ఓర్పు, మొదలగు గుణములనివి బోధించుచు, నందరికిని ప్రియములుగా . చూడుఁడు : శౌర్యము మంచిదే కాని, యిది సమానుల విషయమందు పనికివచ్చును. తనకంటె దుర్బలులైన వారియెడల శౌర్యమును జూపుటమే యని యంద అంగీకరింతురు. తనకన్న బలవంతులయెడ ప్రయోగించితిని జూచి " బలే " యని మెచ్చుకొనువారు కొందఱున్నను అది యవివేక మెక్కువ. వేమనయు నీ వివేకుల గుంపులో చేరినవాఁడే.

              "ఆ.ఎదుటి తనబలంబు లెంచుకో నేరక
                  దీకొని చలముననెదిర్చె నేని
                  ఎలుగు దివిటి సేవ కేర్పడు చందంబు..." (646)

            "ఆ. అనువగానిచోట నధికులమనరాదు,
                  కొంచెముండు టెల్ల కొదువగాదు,
                  కొండ యద్ద మందు కొంచెమైయుండదా?..." (128)

ఇట్లే యితరుఁ డెవఁడైనను, తన్ను దండించినయెడల సహింపక తిరుగcబడు "ధైర్యముగానే తోఁపవచ్చునుగాని, అట్లు దండించుటవలన తనకు మేలేయగు నని సహించుకొని యుండుటయే వివేకమని వేమన్న మతము'

             "ఆ, చాకి కోక లుదికి చీకాకుపడఁ జేసి
                   మైలఁ దీసి లెన్స మడిచినట్లు
                   బుద్ధిఁ జెప్పవాఁడు గ్రుద్ధితే నేమయూ ?..." (1502)

పై రెండు విధముల నీతులను సాక్షాత్తుగాఁ జెప్పట యొక తీఱు. వాని నాచరిం చుటచేతను, విడుచుటచేతను గలుగు ప్రాపంచికస్థితులను ఉన్నదున్నట్లుగాఁ చేయుట మూలముగా పై నీతులను వ్యంజింపఁజేయుట యంతకన్న బలవంతమైన మార్గము. వేమన కీమార్గమం దాశ యొక్కువ. శక్తియు నెక్కువ. డు :

              "ఆ, ఆలి మాటలు విని అన్నదమ్ముల రోసి
                    వేఱె పోవువాఁడు వెట్టివాఁడు
                    కుక్కతోఁకబట్టి గోదావరీఁదునా ?.” (298)

స్పష్టముగాc జెప్పట యొక విధము. ఈ క్రిందిదంతకన్న బలవంతమైన గార్గము :

             "ఆ. ఆలివంకవారు ఆప్తబంధువులైరి
                   తల్లివంక వారు తగినపాటి,
                   తండ్రివంక వారు దాయాది పగవారు." (300)

ఇట్లే ప్రపంచమందు పలుకుబడి, మర్యాద సంపాదించుటకు తక్కినయన్నిటి ద్రవ్యము ముఖ్యము గావున, దానిని నంపాదింపుఁడని న్పష్టముగాఁ జెప్పట ఈ క్రింది పద్యముసందలి వస్తుస్థితికథనము ఎక్కువ ఫలకారి :

              "ఆ. కులము గలుగువారు గోత్రంబు గలవారు
                   విద్యచేత విఱ్ఱవీఁగువారు,
                   పసిఁడి గల్గువాని బానినకొడుకులు..." (1138)

ఇట్టి మఱి రెండు పద్యములు :