పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/131

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                వేమన కవిత్వము, హాస్యము, నీతులు  125

వలయునను నుద్దేశముచేతనే కొన్ని కొసరుమాటలుచేర్చి వ్రాయుట యితనిపద్దతులలో నొక్కటి, లోభివాని నడుగుట నిష్పలము : గొడ్డుటావును బితికినట్లు ; మేక మెడ చన్ను గుడిచినట్లు-అని చెప్పినఁజాలును గదా. ఇతని కంతటితో తృప్తిలేదు.

                      "ఆ. గొడ్డుటావఁ బితుకc గుండ గొంపోయిన
                            పండ్లు రాలఁ దన్ను; పాలనీదు
                            లోభివాని నడుగ లాభంబు లేదయా ..." (1333)
                      "ఆ. మేక కుతికఁబట్టి మెడచన్ను
                            గుడువఁగా ఆ(కలేలమాను నాశ గాక,
                            లోభివాని నడుగ లాభంబు గలుగునా ?..." (372)

ఇందు కుండఁగొంపోవట, కుతికఁబట్టుట మొదలగునవి పాలు త్రాఁగఁబోవు దాని యాత్రమును స్పష్టంగా జూపి, వాని యజ్ఞానమునకు మనల నవ్వించును.

ఈ హాస్యప్రియత్వమునకుఁ జేరినదే వేరొక శక్తి, యితనియందుఁ గలదు. అందరికిని దెలిసిన సామాన్యన్యాయమునే గంభీరముఖముతో రెండుపాదములతోఁ జెప్పి, మూఁడవపాదములో దానిని తలఁపని తలంపుగా క్రొత్తతోవకు తటాలునతిప్పి చెప్పట, ఉపవాసమున్నయెడల దేహమందు జీర్ణముగాని మలమలన్నియు జీర్ణ మగునని వైద్యశాస్త్రము. వేమన్నయు నిట్లే తన పద్యము మొదలుపెట్టెను.

                      "ఆ. కూడుఁ బెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని
                            భక్షణంబు చేయుఁ గుక్షిమలము..."

ఈ మాట విన్నవారు 'ఏమిరా ! వేమన్న ఉపవాసద్వేషియే. ఇంతలో తన యబిప్రాయమునువే మార్చుకొన్నాఁడా? అట్లైన మన శాస్త్రములు బ్రతికినవే !' యని నంతోషించునంతలోనే పిడుగువలె మూఁడవపాదము వెడలి పడి నిరాశ చేసినది.

                      కూడు విడిచి మలము గుడుచురా యుపవాసి..." (1157)

దీనిని విని మససు నొచ్చుకొనువారే యెక్కువయైనను నవ్వఁగల రసికులును కొందఱుందురు. కాని యోక్రింది పద్యమునువిని నవ్వనివారుండరు :

                 "ఆ, సకలతీర్ధములను సకల యజ్ఞంబుల
                       తలలు గొరుగకున్న ఫలము లేదు.
                       మంత్రజలముకన్న మంగలిజల మెచ్చు." (3772)

పై కవితాధార, హాస్యము - దీనికి తోడు ఇతని నామము నాంధ్రదేశమున నాచంద్రార్క స్థాయిగాఁ జేసినవి ఇతనినీతులు. ఇహలోకమున ఇతరులకును, తనకును సౌఖ్యమును గలిగించునవి నీతులని మొదలే విన్నివించితిని. కావున ఇతని నీతులును స్వార్ధములని పరార్ధములని రెండు తెగలగును, తత్త్వవాదము లకువలె ఇతని నీతులకును అనుభవమే మూలముగాని పుస్తకములుకావు. కావుననే యవి యప్పుడును ఇప్పడును అనేకులన్నట్లు, ఇతనికి పుస్తకములు వ్రాయుటకును ఇతరుల కుపన్యసించుటకును మాత్రము కావు. మంచిచెడ్డలను రెంటిని తాను జేసి యందలితత్త్వమును చక్కఁగా నెఱిఁగి, యితరులకు బోధించినవాఁడగుటచే సామాన్య నీతిగ్రంథములలోలేని తీవ్రత యితని పద్యములలోఁ గలఁదు.

                   "ఆ. విన్నవానికన్న కన్నవా(డధిగుంగు
                         కన్నవారికన్న కలియువాఁడు." (3522)

అను మాట యితని నీతులందును అన్వయించును. నీతులు పరార్ధములని స్వార్థములని రెండు తెఱఁగులంటిని. కాని యనేక