పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/130

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                          వేమన   124

బైటికిఁ దీసినపుడు హాన్యమునకు బలమెక్కువ. ఇట్టి సూక్ష్మదృష్టి గలవాఁడు తన యందలి తప్పలను గూడ గమనించి, చెప్పకొనక, తనలోనే నవ్వుకొనును. అట్టి చోట తమవేషము, భాష, ఆచారము, విద్య ఇత్యాదులన్నియు నిష్కల్మషములని నమ్మినవారికి, ఇతరులందలి తప్పలను గమనించు సామర్థ్యమో సంప్రదాయ మోయున్నను, ఆందుచే వారియందసహ్యము జనించి తిట్టఁగలరు కాని నవ్వింపలేరు. కావుననే మొన్న మొన్న వీరేశలింగము పంతులుగారి వ్రాఁతలు బైలు పడువఱకును తెలుఁగు భాషలో నయమైనహాస్య మపురూప మయ్యెను. వారి హాన్యమునందును సంఘసంస్కార దృష్టి ప్రబలముగా నా వేశించి, స్వదోష దృష్టి చాలవరకు తప్పించుటచేత, తిట్లు ఎత్తిపాడుపులును ఎక్కువై రసము చెడినది. ఒకరి తప్పులను బైటఁబెట్టిన దెల్ల హాస్యము గానేరదు. బైటఁ బెట్టుటలోఁ గూడ మార్గమున్నది. హాస్యమును గల్గించుటయు నొక శిల్పము. ఇటుక గారలతో మాత్ర మిల్లెట్లుగాదోయట్లే తప్పులు పట్టిన మాత్రమున నితరులు నవ్వరు. ఆ రహస్యములు శిల్పి మాత్రమే యెఱుఁగును. హాన్యమువలని ఫలము జనుల చిత్తసంస్కారమైనను అదే ముఖ్యోద్దేశముగాఁ గలవాని వ్రాఁతలో హాస్యముండదు; నీతిని బోధింప వలయుననియే పద్యములు వ్రాయువారి వాఁతలో కవిత్వములేనట్లు వారిదృష్టి యంతయు ఫలముమీఁద నుండునుగాని శిల్పముమీఁద నుండదు. వీరేశలింగము పంతులుగారి హాస్వరన మిందువలననే చెడినది. వారి ప్రహసనములను చదివి నవ్వుటకు సామాన్యముగా నాకు సాధ్యముగాదు. నిజముగా తెనుఁగుభాషకు మొట్ట మొదట హాస్యరసము చవిచూపిన ధీరుఁడు గురజాడ అప్పారావుగారే. వారి *కన్యాశుల్క' మందున్నంత హాస్యరస నైర్మల్యము తక్కిన యెవరిగ్రంథము లందును లేదనుట యతిశయోక్తి కాదు.

వేమన్నయు గొప్ప బోధకుఁడును సంస్కర్తయుఁ గావున అతని యందును హాస్యరసము కలుషితమై యున్నను, అందందు సహజముగా అసభ్యరచనలు చేసినను, తెగిన గాలిపటమువంటి స్వతంత్రబుద్ధి కలవాఁడు కావున, ఒక్కొక్క మాఱు తనపని తాను మఱచి స్వచ్చమైన హాస్యముతో తృప్తి కలిగించు కొనును'

                  "ఆ. పాలసాగరమున పవ్వళ్ళంచినవాఁడు
                       గొల్లయిండ్ల పాలు కోరనేల ?... "

యను ప్రశ్న వచ్చినది. తక్కిన సమయములందు ఇవన్నియు "బూటక పురాణ కథలు' (2752) అని చెప్పియుండును. కాని యిప్పడా యుద్రేకము లేదు. ఇప్పటి జవాబు వేఱు“

                  "ఎదుటివారి సొమ్ములెల్ల వారికి తీపు..." (2509)

ఇది విన్న వాఁడెంత కృష్ణభక్తుఁడైనను నవ్వక యుండలేఁడు. 'గొప్పగురువులు ఊళ్ళలోనుండరు గాని కొండ గుహలలోనుండును. వారి యాశ్రయములేనిది ముక్తి మార్గము దుర్లభము" అని యెవఁడో యన్నాఁడు. ఔను నిజమని వేమన్నయు నన్నాఁడు.

                   "ఆ, గుహలలోనఁ జొచ్చి గురువుల వెదకంగ
                        క్రూరమృగ మొకుడు తారసిలిస
                        ముక్తి మార్గ మదియె ముందుగాఁ జూపురా.." (1328)

సామాన్యముగా ఇతరుల లోపములనెత్తి ఖండింపఁబూను కొన్నప్పడు గూడ దాని కెంత గావయలనోయంతటితో తృప్తిఁబొందక, యితరులకు నవ్వు గలిగింప