పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము. 7

దానిని తిద్దుటకు మాత్రము వెనుదీయరు. ఇట్టివారిని గూర్చియే బ్రౌనుదొర ఒక వ్రాఁత ప్రతిపై స్వహస్తముతో

            " తే, తప్ప గమనించి వ్రాయు టుత్తమము, లేక
                  ప్రతి సమాసముగా వ్రాయు టతిముదంబు ;
                  రెండు విడనాడి వ్రాసెడి లేఖకుండు
                  గలుగు టరయంగఁ గవి యభాగ్యంబు గాదే !"

యని వ్రాసికొనెనఁట. [1]చూడుఁడు ; 'ఉప్పకప్పరంబు' అను వేమన్న ముద్దు పద్య మెఱుగనివారు లేరుగదా. ఇది యొకానొక ప్రాతప్రతిలో నిట్లున్నది'

               " ఉప్పుకప్పరంబు వొక్కరీతున నుండు
                  చెప్పజెప్ప వారి చెవులు వెఱ్ఱి
                  పురుష రూపొక్కటి పుణ్య పురుషుఁడు వేఱు "
                                              (ఓరియింటల్ లైబ్రరీ, మద్రాసు, 13-12-20)

వ్రాత ప్రతుల స్థితి యిట్లుండఁగా అచ్చుప్రతులు మరింత యసహ్యముగా నున్నవి. అందును 'గుజిలీ" ప్రతులకన్న 'పరిశోధించి" వేసిన నవనాగరకుల ముద్రణములు చాల అశ్రద్ధను వెలిబుచ్చుచున్నవి. వేమన స్వభావము, మతము, కవిత్వధర్మము, భాష మొదలగు వాని నేమియుగమనింపక, వ్రాఁత ప్రతుల పాఠములను విచారింపక, అర్ధభావములకు వచ్చుననర్ధమును లక్ష్యపెట్టక, దిద్ది ముద్రించిన పాఠము లనేకములందుఁ గలవు. మచ్చుకు ఒకటి రెండు

            " ఆ, తెవులుఁ బడ్డవాఁడు దేవతాభక్తుండు,
                   ఈటె లేనివాఁడు పోటుబంటు,
                   కాసులేని వాఁడు కడుబ్రహ్మచారియౌ
                   విశ్వదాభిరామ? " (ఓ. లై. 12 - 9 - 19)

ఇది ప్రాచీన పాఠము. దీనికి బందరు ప్రతిపాఠము :

               " తెలుఁబడ్డవాఁడు దేవతాభక్తుండు
                 మాట లేనివాఁడు పోటు బంటు. " (1966)

వావిళ్ళవారి కడపటి ముద్రణము చప్పుడులేకుండ దీనినే యనువాదము చేయు చేయుచున్నది.(చూ.పె 178) మఱియు.

          " క. పసరపు నంజుడు మెక్కియు
                మసలక సురcద్రాగ ముసలి మానులఁ గూర్చెన్
                కుసుమాంగి కధర మాంసము
                కుసుమాస్త్రు ని బెట్టి చెఱచె కుంభిని వేమా" (2477)

ఇది బందరు ప్రతిపాఠము. *అర్థమేమిరా" యని తల పగులఁ గొట్టుకొంటిని. వాఁతప్రతులు సాహాయ్మమునకు వచ్చినవి :

          " క. పసరపు మాంసముఁ బెట్టియు
                మసలక సులతాను ముసలి మానులఁజేసెన్
                శశిముఖుల యధరమాంసము కుసుమాస్తుఁడు
                పెట్టి చెఱిచె కులములు వేమా" (ఓ. లై., 11-6-15)

  1. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగాయ చెప్పినది,