పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన కవిత్వము, హాస్యము, నీతులు 123

తిని ; కాని మణి రెండైనను ఉదహరింపక యుండలేను :

                 "ఆ, పనుల వన్నెవేఱు పాలేక వర్ణమౌ ;
                       పుష్పజాతివేఱు పూజయొకటి ;
                       దర్శనములు వేఱు దైవం బదొక్కటి..." (2480)

                 “ఆ. తల్లి దండ్రిచావఁ దానాలితో గూడి
                       యిల్లు కట్టియున్న యింపులెల్ల
                       కొఱితిమీఁది దొంగ కూడదిగిన యట్లు...? (1851)

ఇట్లు వ్రాయ గలవాని యభిప్రాయములతో మనమేకీభవించిన నేమి ? ఏకీభ వింపకున్ననేమి? ఒక మాఱు విన్న తరువాత పండితుఁడుగాని పామరుఁడుగాని దీనిని మఱవఁగలడా ! సంపఁగిపూవుల వాసన తలనొప్పి దేవచ్చును. కాని యేమి చేయఁగలము? ముక్కెంతపొద్దు మూసికొనవచ్చును ? కోపము వచ్చిన పెరటిలోని చెట్టును గొట్టివేయపచ్చును. కాని మైసూరుసీమలో నెక్కడికిఁ బోయెనను పూచిన సంపఁగి మాఁకులే ! వేమన సిద్ధాంతముల సంగీకరింపనివారి కతనితోడి బతుకును అంతే.

ఇతని కవిత్వముకు కొంత మఱుగుఁపెట్టి దానిని దుర్వారబలముగల దానినిగాఁజేసినది హాస్యము. మనలో నయము తోడి హాస్యములేదని మొదలే విన్నవించి తిని. నవరసములలో హాస్యమునుగూcడా జేర్చియున్నను, ప్రాచీసుల హాస్యము అసహ్యములును, అసభ్యములును వర్ణించుట యందు మాత్రము చరితార్ధమైనది. కావుననే హాస్యరస ప్రాధానములగు ప్రా చీన ప్రహసనములను చదువుట కిప్పటి నాగరకత గలవా రేవగింతురు. ప్రాచీన నాటకములలో కొంచెము నాగరకత గల హాస్యమును జూపుటకై యేర్పడిన పాత్రము విదూషకుఁడు. కాని వాని హాస్యము గూడ, ఎద్దు మొద్దుతనము, తిండిపోతుతనము-దీనిచే నేర్పడునట్టి అసహ్యపు నవ్వే. కాళిదాసు మొదలు ఇట్టి పద్దతిని కొంతవఱకు తప్పించి మాళవికాన్నిమిత్ర నాటకమున కొంత జాణతనము, చురుకుఁదసముగల విదూషక పా త్రమును తయారు చేసెను. సంప్రదాయజ్ఞలు దానిని ఖండించుటచేతఁ గాఁబోలు,తరువాతి నాటకములలో యాథాప్రకారముగా తిండిపోతు విదూషకునినే యుచ్చు గొట్టెను. తరువాతి వారు సరేననిరి. తెలుఁగువారమగు మనము ఆన్ని విధముల సంస్కృతము వానినే యనుసరించిన వారము. ఆ విదూషక పాత్రమే యట్లే చెక్కుచెదరక కీర్తిశేషులు శ్రీ కోలాచల శ్రీనివాసరావు గారు మొదలగు ఇప్పటి వారి నాటకములలోకూడా వచ్చినది. చక్కని హాస్యమును సృజించగల సామర్ధ్యములను విని కడుపునిండ నవ్వుటకు శక్తిగాని మనలోలేక పోలేదు.ప్రాచీన సంస్కృతాంధ్ర పండితులలో సభ్యుముగా వినువాని కడుపులు చెక్కలగునట్లు నవ్వింపఁ గల వారిని నే నెఱుఁగుదును. కాని వాజ్మయమును, జీవితమును వేఱుచేసికొన్న వారగుట చేత, పేనా పట్టుకొని వ్రాయ నుపక్రమించిన యెక్కడలేని బొమముడులును అపుడు మనవారికి దాఁపురించును. మఱియు, సంప్రదాయమున దాసులై యభిప్రాయములందును, భావములందును, స్వాతంత్ర్యము లేని వారివద్ద హాస్యమునకు అవకాశమును చాల తక్కువ. హాస్యముసకు మూల ప్రకృతి యితరుల యందలి తప్పలను బైలు వెట్టుట. అందును తప్పకలదను నభిప్రాయమే సామాన్య జనులకు లేనట్టి చోటులందలి తప్పను ఆకస్మికముగా