పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/128

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                         వేమన   122

ఆటవెలఁది నితఁడు పరిగ్రహించె ననవచ్చును. కందములు, తేటగీతి మొదలగు పద్యములు గూడ నితఁడు వాడినాఁడు గాని వానిలో చాలవఱకు ఈముద్దు, ఈ చెక్కిన చక్కcదనము, ఈ బిగువు, ఈ లగువు లేదు.

దీనిలో ఇతఁడు యతికిచ్చిన మర్యాద, అందము, అద్భుతమైనది. ఆంధ్ర వాజ్మయములో యతిని పరస్పర విరుద్ధముగా విచిత్రముగా వాడిన వారిద్దఱు : మొదటివాఁడు తిక్కన సోమయాజి-యతి కావలసినవారు ప్రయత్నముగా నితని కవిత్వమందు వెదకి చూడవలసినదే కాని, యది తప్పక యందుండినను సామాన్య ముగ చేతికిఁ జిక్కదు. లయాను సారముగా పాదమధ్య మందొకచోట పదము నిలుచుట యతి యని ప్రాచీన నియమము. దానిని వదలుకొని తెలుఁగువారు, అట్టి చోట మొదటి యక్షరము మరల నావృత్తి కావలయునని యొక మొండి పట్టు పట్టుకొన్నారు. వారి పీడను వదలించుకోలేక తిక్కన, యది వచ్చినదనిపించి ముందుకు వెడలినాఁడు

                        "గురుభీష్మాదులు సూచుచుండ సభమీకున
                         గీడు నాఁడట్లు ముష్కరులై చేసిరి యంతచేసియు
                         పశ్చాత్తాపముంబొంద నోపర.."
                                                          (భారతము, ఉద్యోగపర్వము)

అనృపుడు, 'అప్పకవీయము" చేతలేనివారి కందలి యతి కాన్పింపదు. ఈ తప్పించుకొని తిరుగు కౌశల్యము తిక్కన కచ్చినట్లు మఱెవరికిని అబ్బలేదు. కాని యీ మార్గమే కొంత సులభమని తక్కిన వారందఱు నాతోవనే తొక్కి0. నేనెఱిఁగి నంతవఱకు వేమన్న యొక్కఁడే ఈ విషయమున తిక్కన కెదురు తిరిగిన వాఁడు. ఎక్కడికి యతి యుండవలయునో యక్కడికి పదమే కాదు, ఆభిప్రాయమును తెగి నిలుచును. వెంటనే ఆద్యక్ష రా వృత్రియు తడవుకో నక్కరలేక సిద్ధముగా దా(పురించును. లేదా ప్రాసము సిద్ధము. చూడుడు :

                       "ఆ. కడుపు బోరగించి కన్నులు ముకిళించి
                             బిఱ్ఱ బిగుసుకొన్న బీదయోగి
                             యమునిబారిగొఱ్ఱె యతఁడేమి సేయును." (873)

                       "ఆ. కోతి(బట్టి తెచ్చి క్రొత్తపట్టము గట్టి
                             కొండముచ్చలెల్ల కొలిచినట్లు
                             నీతిహీను నొద్ర నిర్భాగ్యులుందురు..." (1201)

ఇతని భావములెట్లు కృత్రిమములు కానివో యితని భాషయు నట్లే. ఇదే నిజమైన యచ్చ తెనుగు. ప్రాచీనులకు సంస్కృతమువలె, ఆధునికులకు ఇంగ్లీషు వలె, స్వభాషా స్వరూపమును జెఱచునట్టి రెండవభాష యేదియు వేమన్న యెఱుఁగ(డు. కావుననే, యోగరహస్యములను తెలుపుచు పారిభాషిక పదములతో నిండిన పద్యములు తప్ప, తక్కిస యేమాట చెప్పినను, తెలుఁగు మాటలాడ నేర్చినవాని కెవ్వనికిని ఇతని పద్యము లర్ధము కానివి యుండవు. గొప్ప తత్త్వవిషయములు చెప్పునప్పుడును ఇతని ధార యిట్లే యుండును. 'ఈ సౌలభ్యమందే అనన్య సాధారణమయిన యతని కవితాశక్తి యడఁగి యున్నది." తాను చెప్పు ప్రతి న్యాయము నకును ఒక యుపమానము తప్పక యుండును. ఆ యుపమానములు గూడ ఊహా కల్పితములు గాక, యింటిచుట్టుముట్టుఁగల వస్తువు లగుటచే, వాని సొగసును బిగువును అంద అనుభవించి యానందింతురు. ఇదివరకే యెక్కువ యుదాహరించి