పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/127

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
              వేమన కవిత్వము, హాస్యము, నీతులు 121

గాదు. ఇవి వానికి లొంగి సర్దుకొనవలసినవే కాని యవి దీనికి లొంగి కుంటుచు నడవనేరవు. కావుననే యందఱికివలె నీ నిర్బంధములు సంకిళ్ళవలెనుండక, ఇతని కవితకు కడియము లుంగరాలవలె అలంకారములైనవి. మఱియు, కొన్నిచోట్ల పై నిర్బంధములను విడిచి తెగించి వ్రాసినను, మఱికొన్నిచోట్ల లేని నిర్బంధములను కల్పించుకొని, యంతే ధారాళముగా వ్రాసి, వేమన విచిత్రములైన దొమ్మరి లఘువులను చూపుచున్నాఁడు. మనలో వృత్తిజాతులందలి యక్షరసంఖ్యానియమమును ప్రాసనిర్బంధమును వదిలి యతినిమాత్ర ముంచుకొన్న చిన్నసులభమైస పద్యము ఆటవెలదిగదా ? దానిలోను ప్రాసమును చేర్చుకొని యితఁడుచేసిన సరళమైన సాము చూఁడుఁడు : '

               "ఆ, చదుపులందు పాడి మొదవులందుసు స్త్రీల
                     పెదవులందు రాజ్యపదవులందు
                     ఆశలుడిగినట్టి యుయ్యలు ముక్తులు..." (1479)

                "ఆ, ఆకులన్ని దిన్న మేక పోతులకేల
                     కాక పోయెసయ్య కాయసిద్ధి ?
                     లోకులెల్ల వెట్టి పోకిళ్ళఁ బోదురు..." (223)

ఇతనియందలియర్థముగాని కవితారహస్యములలో ఈ ఆటవెలఁది యొక్కటి. ఇంత చిన్న వృత్తములో, అంతగొప్ప భావములను, యతిస్థానములు వదలక, వెనుక ముందు అతుకులు తిరుగుడులు లేక, కత్తిరించినట్లున్న శబ్దార్ధములతో, ఎట్లితఁడు అచ్చువేసినాఁడురా?" యను ప్రశ్న పద్యములు వ్రాయుటకు చేయివేసిన వారి నెల్ల తెగనిది. ఇతని పద్యములు చదివినతరువాతఁగూడ ఆటవెల(దిలో వ్రాసెద నని చేయి వేయువాఁడు నాకుఁ జూడఁగా వెఱ్ఱివాఁడు. శ్రీనాథుఁడపురూపముగా నిదేపద్ధతిలో ఒక యూ టవెల(ది చాటుపదము ; వ్రాసెను

             "ఆ. చిన్న చిన్న రాళ్ళు చిల్లరవేపుళ్ళు
                  నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
                  సజ్ఞజొన్న కూళ్ళు సర్పంబులును దేళ్ళు
                  పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు"

కాని యిట్టివి నాలుగైనను వ్రాయకమునుపే యతనికి రెడ్డిరాజుల ముందు సభామందిరములలో చేయెత్తిపాడుటకు తగిన సీసపద్యపు గాంభీర్య దైర్ఘ్యములపై మనసుపోయినది. ఒక్కొక్కరి కొక్కొక్క జాతిపద్యముపై సహజమగు నభిమాన ముండును. కాళిదాసు "మందాక్రాంత", భవభూతి 'శిఖరిణి", తిక్కన 'కందము" సుప్రసిద్ధములే. తెలుఁగువారిలో తరువాత కవిచౌడప్ప, సుమతిశతకకర్త మొద లగు శతక కవులనేకులు కంద మందభిమాన మొక్కువగా చూపి, చక్కని పద్యము లను వ్రాసిరి, అట్లే వేమన్నకును 'ఆటవెల(ది పై నభిమానము సహజభావములలో నొక్కటి. కాని కారణమును గలదు. తమ యభిప్రాయమును స్పష్టముగా చిక్కు లేక చెప్పఁగోరు వారెవరుగాని పెద్దపెద్ద వృత్తములను వాడరు. వానికి చేయివేయుట యేనుఁగును గట్టినట్లు: కడుపునిండ దానికి తిండి మొదగించుటయే పెద్ద కష్టము. కాఁబట్టి యే ఆకలములనో తెచ్చి దాని పొట్ల నింపవలసి యుండును. అర్ధభావము లకు మితియున్నదిగాని భాషకులేదు. కావున ఏవో బొద్దు అక్షరాలుశబ్దమలచెత్తను బేర్చి పద్యములు నింపవచ్చును గాని యసలు వస్తువు చెడక తప్పదు. వేమన యిట్లు మొదలు చెఱచు బేహారి కాఁడు. కావుననే తెలుఁగు ఛందస్సులలో నెల్ల చిన్నదియగు