పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన కవిత్వము, హాస్యము, నీతులు 117

మద్యమునుగూర్చి కాళిదాసు మొదలగు వారందఱును కమ్మని పద్యములు వ్రాసి యుండఁగా సిగరెట్లు చేసిన తప్పేమి ? భావము లిట్టివే కావలయునను నిర్బంధము లేనప్పడు విషయములకు మాత్రమేల నిర్బంధము ? ఎట్లు నిర్బంధింపఁ గలము?

తక్కిన కవి, భాష, వినువాఁడు అను మూఁడు పదార్ధములలో ప్రతియొక్క టియు కొంత విశేషధర్మము గలిగియుండవలెను. ఎవఁడైనను ఎట్టి భాషలలో వ్రాసినను ఆది యెవరిమనసున కైనను ఎక్కును అని చెప్పలేము. కవిత్వమందలి ముఖ్యజీవథర్మము ఇతరుల మనసు కెక్కుట, అదే మన కర్ధముగాని రహస్యము. 'ఇట్లు వ్రాసినదానిని విని మే మానందింతు మని శాస్త్రము వ్రాయుట యెవ్వరికిని సాధ్యముగాలేదు. అట్టి ఆకర్షణశక్తి యెవడో యొకనికి దేవుఁడు ప్రాసాదించి యుండును. అట్టివాఁడు తప్ప తక్కినవారు కవులు కా(జాలరు. అతఁడే తనకుఁ గావలసిన విషయములవలె తన భావములను వెలువఱచు భాషనుగూడ ఏఱు కొనును, స్థూలముగాఁ జూచిన, సంగ్రహము, స్పష్టత, సరళత మొదలగునవి కవిత్వభాష కుండవలసిన ప్రధానగుణములు, వినువారు సహృదయులుగా నుండ వలయును. అనఁగా, కవికెట్టి హృదయముగలదో యట్టిది కలవారనుట, హృదయ మందు జనించు భావములను ఏకారణము చేతనైనను అడఁచిపెట్టుకొని, క్రమ ముగా భావించుశక్తినే యనేకులు చంపుకొని యందురు. అట్లుగాక యేభావమైనను సంపూర్ణముగా ననుభవించు సహజమైన హృదయసత్వము గలవారు సహృదయులు. ఇట్టివారు కవిత్వమును విన్నప్పడు తమ హృదయమును మఱచి కవి హృదయముతో చూడఁగల్గుదురు. అనఁగా, కవిత్వమును విని యానందించుటకు అహంకారము పనికిరాదన్నమాట. అహంకారమనఁగా గర్వము కాదు. నేను, నాది, నా భావము, సిద్ధాంతము, అనునట్టి జ్ఞానము. అది యుండువఱకును కవి యేమి చెప్పినను అది నా కేవిధముగా నన్వయించును, నా యభిప్రాయముల కనుకూలముగా చెప్పి నాఁడా లేదా" యను దృష్టికలిగి, దానికి తగినట్లు మనకు సుఖమో దుఃఖమో కొపమో అసహ్యమో కలుగును. వేమన్న సమాధినుండి లేచివచ్చి, నాయకా యుపన్యా సములను విని వెక్కిరించి వేళాకోళముచేయుచు చక్కని పద్యములు రచించి నా మొగము ముందఱనే చదివినాఁడనుకొందము. అప్పడు నా యందు సహృద యత్వము గలదేని, అది యెందుకైన తరమగునేని, వేమన వెక్కిరింపులచే నాకుఁ గలుగు అవమానము, నిరాశ మొదలగు అహంకార గుణములను మఱిపించి, అతని పద్యమలందలి కవిత్వపు చక్క_cదనమును మాత్రము నేను గ్రహించి సంతో షించుసట్లు చేయవలయును. అనఁగా, కవిత్వమునకు విషయమైన వస్తువు పాలికి కవిత్వములేదు. చంద్రుఁడు, మల్లెపూవు మొదలగు జడవస్తువులపై నెంతమంచి కవిత్వమును వ్రాసినను అవి యెట్లు దాని సౌఖ్యము సనుభవింపలేవో యల్లే మనపై వ్రాసినను, మనము మనమైయుండు వఱకును, దాని మాధుర్యము నెఱుఁగలేము. అట్లుగాక మన యభిప్రాయములు, భావములు మఱచి కవితో నేకీభవింపఁ గలమేని, అప్పడు, ఇట్టిదని నిర్వచింపరాని యొక యూనందము కలుగును. ఈ యూనందము ప్రత్యక్ష సిద్దమే కాని, ప్రమాణములతో స్థాపించి చూపుట సాధ్యముగాదు. ఇట్లు కవితా ప్రపంచమందును మమతా పరిత్యాగ పూర్వకమైన సాయుజ్యమే మోక్షా నందమునకు కారణము.

ఈ సాయుజ్యమును గలిగించుటకు ఛందస్సొక గొప్ప సహకారి వస్తువు ఛందస్సునందు ముఖ్యముగా నుండు (ఉండవలసిన) గుణము లయము. లయ