పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/121

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                  చేమన కవిత్వము, హాస్యము, నీతులు  115

చదువుకొన్నవారెల్ల పామరులనియును, చదువనివారే పండితులనియు వేమన్న తల(చెనని యూహింప సాధ్యముగాదుగదా? అట్లే అప్పటికిని ఇప్పటికిని చదువు కొన్నవా రితని కవిత్వపు విలువకు లొంగియే యున్నారు. జీవితమునం దితని పద్యముల నుపయోగింపని పండితుఁ డాంధ్రదేశమం దున్నా (డా ? వేమన్నను కవి యని బాహాటముగాఁజెప్పక పోవచ్చును : ఎఱుఁగకయు పోవచ్చును. అందుచే నతనికి బిరుదు బహుమానములీయక పోపచ్చును.దానికి కారణము వేఱు. కష్టపడినవారు కష్టముసకు వెలయిత్తురు.. నైషధమువంటి 'యౌషధ' కవిత్వమును అర్ధముచేసికొనుటకై తలపగులగొట్టుకొను నోర్పును సంపాదించుకొన్నవారు, మెదడున కేమాత్రమును శ్రమనియ్యని మెత్తని వేమనపద్యములపంటి వానిపై నెక్కువ శ్రద్ధపుచ్చుకొనుట సహజము గాదు. మిరియపకాయల మద్దయగు " గోంగూరపచ్చడి " తిని జీర్తించుకొనఁగల గుంటూరి వారికి ఆదివడ్డించినపుడే నోట నీళ్ళూరును; కాని వారికి పాలు పెరుగు రచింపదా ? వానిని వారు వదలిరా ? మఱియు పదార్ధమెంత విలువయైనదో యది యంత సులభముగా దొరకవలయు ననుట సృష్టి ధర్మము. ఎంతసులభమో యంత దానికి వెలతక్కువ యనుట యర్థశాస్త్రసిద్ధాంతము. గాలివంటి యమూల్యపదార్ధము మసకు సులభముగా లభింపకున్న మసగతియేమి ? సులభము గావుననే దానికి వెలయిచ్చువారెవరు? వేమనకవిత్వము గాలి వంటిది. అది దూరని చోటులేదు; దొరకని తావులేదు. కావుననే యుందఱును దాని నుపయోగింపక తీఱదైనను అతనిని పిలిచి మహాకవివని మర్యాదచేయుట కెపరికిని కాఁబట్టకపోయినది.

ఇట్టి సర్వవ్యాపిత్వమును వేమన పద్యములకు సంపాదించి యిచ్చిన కవితా గుణములేవి ? ఈ ప్రశ్నను తడవుటకు ముందు 'కవిత్వమనఁగా ఏమి? కొంత విచారింపవలసియున్నది. కాని కవిత్వము పరబ్రహ్మమువలె మాయతో నిండిన వస్తువు. ఉన్నదని భావింపవచ్చునుగాని చేతికి స్పష్టముగా దొరకునది కాదు. ఎందుకో మహామహు లెన్నియో విధముల దీనికి లక్షణము వ్రాయ బ్రయత్నించిరి గాని, యూ కవితాదేపత యందఱను చేతికందక నిలిచి మన ప్రక్క చూడ్కినిగిడించి యింకసు నవ్వుచునేయున్నది.మఱియు లక్షణమెప్పడును బహిరంగము లను తెలుపఁగలదుగాని యంతరంగమును దెలుపుశక్తి దానికి లేచు. మల్లెపూవును ఎన్నఁడును చూచి యెఱుఁగని దానికి దాని స్వరూపమును దెలుపుటకు ప్రయత్నించిన వారేమి చేయఁగలరు? రేకులు, కాఁడ మెదలగు వాని సంఖ్య, కొలత వన్నె మొదలగసవి యిట్టిపని చెప్పవచ్చును. కాని యితర పుష్పములం దెందును లేని దాని పరిమళము ఇట్టిదని పర్ణించిచెప్పి యొప్పించుటయెట్లు ? ముక్కుగలవాఁడు దానిని సాక్షాత్తుగా మూర్కొన్నప్పడు తప్ప తక్కినయే మార్గముచే నేవిధముగాఁ జెప్పినను వాని కది యర్ధముగాదు; ప్రతిపదార్ధముయోక్క తత్త్వమును ఇట్లే. సాక్షాత్తుగా అనుభవించిన వారికి అనుభవింపఁగల వారికిఁ దప్ప తక్కినవారి పాలికి లేదు. కవిత్వముగూడ నట్టివే. కాని తా ననుభవించిన వస్తువును అంగాంగములు పరీక్షించి యిదియిట్టిదని లక్షణము నేర్పఱుపఁ బ్రయత్నించుట మానవ స్వభావము. కాని యొంత ప్రయత్నించినను బహిరంగములు దాఁటి లోతుగా దిగినవారు లేరు. ప్రకృతము మనముగూడ నంతే చేయఁగలము.

సామాన్యముగ ఒక వస్తువును గూర్చి తనకుఁ గలుగు భావములను భాష మూలమున ఇతరుల మనసు కెక్కునట్లు వెలువఱించుట కవిత్వ మనవచ్చును.