పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 114

తెగలుగా నుందురు ; పరులకు దాసులు ; స్వయంచానులు. మొదటి తెగవారు పామరులు. వీరెక్కువ చదువుసంధ్యలు నేరనివారు గావున, సామాన్యముగ మనసును తటాలున పట్టి యిూడ్చు వేమనవంటివానికవిత్వమునకు లొంగి లోలోపల నంతోషించినను, రాజసభలలోని పద్యాల పందెములో ఎదుటివారిని పరాభవించి, గండపెండేరములను బహుమానముగాఁ బడసిన బిరుదుకవులను జూచి బెరగై, వారినే సరస్వతియపరావతారములని పొగడి తప్పించుకొందురుగాని, వారితో వేమనను పోల్చిచూతమను ధైర్యమే వారికుండదు. సభలోనందఱు మహావిద్వాంసు లంగీకరించినవానిని కాదనుటకు ఈ నిరక్షర కుక్షుల కధికారమేమున్నది? ఆ విద్వాంసులే రెండవతెగవారగు స్వయంచానులు. ఏ కాలమందో యే కారణము చేతనో మనసులో నిలిచిన సిద్ధాంతములను యుక్తమా కాదా యని చర్చింపక ఆవియే సత్యములనియు తక్కినవి అసమంజసములనియు నిర్ణయించువారు వారు. కవిత్వమునందు దోషములు, గుణము, అలంకారములు, రసములు, కథలు, పాత్రములు, వర్ధనములు మొదలగునవన్నియు ఇట్టివనియు ఇన్ని యనియు నిస్సంశయముగా ఏర్పఱుచుకొనినవారు కావున, ఆ నియమములను స్వల్పముగా మీఱియున్నను గ్రంథకర్త తలవంచుకొని తిద్దుకొనవలయును; లేదా, సభ విడిచి నిరాశుఁడై పోవలయును. ఇంతేకాని వీరొక మొట్టును క్రిందికి దిగరు; దిగుట శాస్త్రప్రకారముతప్పనిమాత్రమే కాదు; దిగవలయునను అక్కరయే వారికి తో(పదు. ఇ(క పైవిషయములలో తెగిన గాలిపటము వంటి వేమన్నను వీరు కవియని యెట్లు పిలిచి సంభావింతురు.

ఇట్లు " శృంగేరీ బహిరస్మాకం వయంశృంగేరిణి బహిః ? అన్నట్లు విద్వాం సులు వేమన్నను గమనింపలేదు. వేమన్న విద్వాంసులను గమనింపలేదు. వేమన ప్రాచీనపురాణ కవుల రచనలను చదువుకొన్నవాఁడే కాని తరువాతి ప్రబంధకవుల దారి యత(డెఱుఁగఁడని మొదలే విన్నవించితిని. విద్వాంసులట్లు కాక, అక్షరాభ్యాస మునకు తరువాత కొన్నాళ్లు 'రఘువంశము', 'భారతము' మొదలగు మృదు కావ్యములను చదివిన శాస్త్రముచేసి, తరువాత 'నైషధము', 'వసుచరిత్ర ........మొదలగు ప్రౌఢ గ్రంథములలోఁ బడి మెదిలినవారు. ఇట్లు నిన్న మొున్నటి వారి కవిత్వములే చదువుకొని ప్రాచీనకవుల మార్గము లెఱుఁగక, తనకవిత్వమునందు తప్పలు పట్టు విద్వాంసులను లక్ష్యముచేయవలసిన యక్కర వేమన్నకు తోఁచలేదు. అతడు సుఖముగా ఇంటిలోనో, లేక యే చెట్లు క్రిందనో కాలుమీఁద కాలువేసుకొని : యిట్లన్నాడు.

              "ఆ. ఆదిమకపులవలె అల్పుండు తానెఱిగి
                   చెప్పలేఁడుగాని తప్పు బట్టు ;
                   త్రోయనేర్చుకుక్క దొంతులు బెట్టునా ?.." (ఓ. లై., 13-3-19)

కాని, యెన్నటికై స తనమాటలవిలుప నర్ధముచేసికొని యuగీకరింప వలసిన వారు పండితులే యగుదురుగాని, పామరులకంత సాధ్యముగాదని వేమన్న యొఱుఁ గక పోలేదు. చూడుఁడు : '

              "ఆ. వేము(డిట్లు చెప్ప వివరపువాక్యముల్
                    వేము(డిట్లు పోవు వెఱ్ఱిపోక,
                    పామరులకు నెల్ల ప్రతిపక్షమై యుండు
                    పండితులకు నెల్ల పరము వేమ" (ఓ. లై., 12-1-30)