పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ:

ఏడవ యుపన్యాసము

వేమన కవిత్వము, హాస్యము, నీతులు.

వేమన కవులని పేరు సంపాదింపని కవులలోఁ జేరిన వాఁడంటిని. పేరు. వచ్చుటకు రెండు హేతువులు : ప్రజయొక్క యభిరుచి నెఱిఁగి వారికి తృప్తిగా వ్రాసినవానికి వచ్చును ; కవియొక్క గొప్పతనము నెఱుంగగల ప్రజ యున్నను. వచ్చును. వేమన విషయమం దీ రెండును లేకపోయినవి.

ఇతcడు ఇతరులకు హితము గావలయునను నుద్దేశముతో వ్రాసెనే కాని, వారు తృప్తిపడవలయునని వ్రాసినవాఁడు కాఁడు. వారు తన్ను పొగడవలయునని, యాశపడి కాని, తిరస్కరింతురని వెఱచి కాని, తన త్రోవను వదలినవాఁడు కాఁడు. మనలో చాలనాళ్ళనుండి 'కావ్యం యశసేఒర్థకృతే" యను సిద్ధాంతము ముఖ్యముగా నెలకొన్నది. కావ్యములు వ్రాయుటకు మొదటి ఫలములు కీర్తి ; ద్రవ్యము కావున కీర్తినిచ్చు పండితులకును, ద్రవ్యమునిచ్చు రాజులకును ప్రీతిని గలిగించినచో కృతార్థుల మైతిమని యనేక కవులు తల(చిరి. దానికిఁ దగినట్లు 'కవిసార్వభౌముఁడు" మొదలగు బిరుదులును, ఎకరాల కొలఁది యినాములును అగ్రహారములును వారికి. లభించుచుండెను. తమ మనసుకు తృప్తి గల్లించినవారి విషయమున ప్రాచీనులు చూపిన మర్యాద, ఔదార్యము అత్యద్భుతములు. కాని కవికి స్వాతంత్ర్యము. పోయినది. ఇతఁ డితరులచేతి బొమ్మ యైపోయినాఁడు. కృష్ణదేవరాయలవంటి దొరయాజ్ఞను తిరస్కరించి, 'ఊరక కృతుల్ రచియింపమటన్న శక్యమే?" యని పెద్దనవలె ధీరముగాఁ జెప్పఁగల మగకవి లేకపోయినాఁడు. ఉన్న యభిరుచికి. ఉదాహరణము లిచ్చువారే కాని, దానిని సరియైన త్రోవలో మార్చి తిద్దఁగలిగిన ధీరులు లేరైరి. క్రమముగా కవిత్వమునకు జీవనము సంపాదించుకొనుట యొక యూనుసంగిక ఫలముగాఁ గాక, ప్రధాన ఫలముగా పరిణమించెను. ద్రవ్యము. గలవా రెవ రే విషయమున పద్యములు వ్రాయమని చెప్పినను ' నరే' యని కవి. నడుముగట్టుకొని సిద్ధముగా నుండవలసి వచ్చెను. ఏ పెద్దమనుష్యుఁ డూరికి వచ్చినను, ఏ గుమస్తాను వేరొక యూరికి మార్చినను, ఏ యెల్లయ్యకు దొరతనము వారి బిరుదు లభించినను, ఆ సందర్భములందెల్ల తప్పక, యేమూలలోనో యున్న కవిని జట్టు పట్టుకొని యిూడ్చుకొనివచ్చి, యందఱిముందుకు త్రోయుట విధిలేని. పనియైనది. కవి యను పేరుగలవాఁడు ఎవ్వరిని జూచుటకు పోయినను, వాని. యూరు పేరులు తెలిసికొని కలిపికొట్టి పద్యములు వ్రాసి పొగడుట ప్రథమ కార్య మైనది. కవికి స్నేహము, ద్వేషము, భక్తి, అభిమానము, అసహ్యము మొదలగు తన భావము లేవియున్నను లేనట్లే, తిట్టుట కధికారము లేదు. పొగడ్తలకు విలువ. లేదు; ఎందుకనఁగా, తాను తిట్టవలసియున్నను ఒకరు పొగడుమన్న వానిని పొగడ వలసినదే కాని, తన యిచ్చానుసారము కాదు గావున,