పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                     వేమన వంటివారు   109

ఆధునికులలో వేమన్నయం దెక్కువ భక్తిగలిగి యతని పద్యములనేకము లేర్చికూర్చి "వేమన జ్ఞానమార్గ పద్యము' లను పేరఁ బ్రకటించినవాఁడును, నెల్లూరి జిల్లా నారాయణరెడ్డిపేట రామస్వామియోగి కుమారుడు, దిగంబరయోగి శిష్యుఁడును అగు

ముత్యాల నారసింహయోగి

'జీవతత్త్వ ప్రబోధ కుసుమావళి" యను పేర నీ వేమన మతమునే ప్రకటించుచు చక్కని కందపద్యములతో గ్రంథ మొకటి వ్రాసెను.

వీరందఱికిని యోగశాస్త్ర పరాయణమగు అమనస్కసమాధియు పరతత్త్వ సాక్షాత్కారమును ఎంతవఱకు లభించినదో లభింపనేలేదో చెప్పలేము. ప్రథమావస్థ ననుభవించిన సాధకులును, వట్టి నమ్మికచే వ్రాసిన భక్తులును వీరిలో నెందరో యుండవచ్చును. రామకృష్ణ పరమహంనుఁడు, వివేకానందుఁడు మొదలగు వారి యనుభవములపై, మాటలపై నమ్మిక గలిగి, తమకట్టి యనుభవమేమియు లేకున్నను ఆ విషయముపై నుపన్యాసములిచ్చి బోధించువారు మనలో నెందఱు లేరు ?

ఇంతటితో నేఁటి యుపన్యాసము ముగింపవలసినదే కాని రామకృష్ణపరమహంనుని పేరెత్తిన తరువాత నూరక దాఁటిపోవ సాధ్యములేదు. ఇదివఱకుఁ జెప్పిన యోగు లెల్లరును తమతమ దేశముల యెల్లలు మీఱినవారు కారు. కొందఱు తామున్న యూరే దాఁటి బైట వచ్చిసట్లు తో(పదు. కాని శ్రీరామకృష్ణుఁడు భరతఖండమందే కాక ఖండాంతరములందును కీర్తిగన్నవాఁడు. కడచిన శతాబ్దమున (1836) వంగదేశమున సామాన్య బ్రాహ్మణ కులమున జనించి, ఎక్కువ చదువు సంధ్యలు లేక, ఒకానొక కాళికాదేవి గుడిపూజారిగా నున్నవాఁడితఁడు. కాని సహజమైన యార్ధ హృదయము, ఆధ్యాత్మిక తత్త్వములం దభిమానము, దైవభక్తియుఁ గల వాఁడగుటచే, ప్రయత్నములేకయే యితనికి దేవతాసాక్షాత్కారము మొదలగు ఆధ్యాత్మికానుభవములు తమంతట కలుగుచుండెడివంట. ఉన్న దున్నట్టు చిన్న నాఁటినుండి యితనికి సమాధియనుభవము గలుగుచుండెనcట. ఇతఁడు తాంత్రిక పూజలు, హఠలయాదిసాధనలు సక్రమముగానే యాచరించి తుదకు రాజయోగిగా పరిణమించెను. ఇతని జీవితమున జరిగినవని చెప్పఁబడు విచిత్రములకు లెక్కలేదు. హిందూదేశమందలి యన్ని మతముల ప్రకారమును ఇతఁడాచరించి తత్త్వానుభవ మును బొందెనcట. ఇతనిని వట్టి పిచ్చివాఁడని యప్పడును కొందఱు తలఁచిరి. ఇప్పడును అట్లనుకొనువారు లేకపోలేదు. అది యెట్లున్నను, విజ్ఞాన ప్రధానమైన ఆంగ్లేయ విద్యను ఆభ్యసించిన వా రనేకులు ఆధ్యాత్మిక ప్రపంచమందే నమ్మికలేక కేవల నాస్తికులైయున్న సమయమున, ఆస్థికతగలవారు హిందూధర్మములు మోక్షసాధకములు గావని తిరస్కరించి క్రీస్తమతమునో లేక దాని రూపాంతరము లగు బ్రహ్మసమాజమునో, ఆర్యసమాజమునో ఆశ్రయించుచుండిన కాలమున, హిందువులలో ఆస్థికులనఁబడినవారు పరస్పర జాతి మత ద్వేషములతో వారికి మోక్షములేదని వీరును, వీరికి లేదని వారును తన్నులాడుకొనుచున్న సందర్భమున, ఈ మహాపురుషుఁడు జన్మించి, సగుణనిర్గుణోపాసనల వివిధ భేదములను తాను ప్రయత్నపూర్వకముగా సాధించి సర్వమతములకు సార మొకటియే యనియు, దైవమని యొకటి నంగీకరించు ఏ మతమునందు శ్రద్ధతో నుపాసనచేసినను పరమ