పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 108

హించి చెప్పశక్తి, ధారాళమైన శయ్య-ఇవి యీ యేగంటివారి పదములలో ఎక్కు వగాఁ గానవచ్చును. ఒకటి యదాహరింతును.

        "పII ఆనందమయుఁడు గావలెను.
              మనసు పదిలము సేయవలెను; ఈ
              తనువులోపలి తెలివి తానె కనవలెను.
              కనుచూప లొకటి కావలెను, అందు
              ఘనచిదానందలింగము గానవలెను. (1)

             “వాయువుల కుంభించవలెను, మిక్కిలి యు
              పాయమున కుండలిని పైకెత్తవలెను.
              తోయజంబులు దాఁట వలెను ; అందు
              పాయకుండెడు నాదు పలుకు వినవలెను. (2)

             "మూcడుయేరులు దాఁట వలెను; అందు
              జోడు బాయని గురుని జాడ గనవలెను;
              మేడ మీఁదికి చొర వలెను ; అందు
              జోడుబాయని హంస జాడ గనవలెను. (3)

             "రేయు పగలొకటి గావలెను ; అందు
              వేయి రేకులమీఁది వెలుగు గనవలెను;
              ఆ యెడను హంస గావలెను; ఆత్మ
              బాయకేగంటి గురు పదవి గనవలెను, ఆనంద|| (4)
                                                  (ఓ. లై., 13-4-30)

కన్నడమందలి 'దేవరనామముల" వలె తెలుఁగులో ఇట్టి అద్వైతబోధకము లగు పదములు లెక్కకు మీఱి కలవు. ఇవి గాక ఇట్టి వేదాంతమునే పద్యరూప ముగ వ్రాసిన శతకకర్తలు అసంఖ్యులు. శ్రీ వం. సుబ్బారావుగారు ఇట్టి వారిని సుమారేఁబది మందిని పేర్కొనిరి (వం, సు. వేమన, పు. 187). ఇట్టివారిలో నొకఁడగు :

ఆనంద వరదరాజయోగి

రచించిన 'నదానంద యోగిశతకము" నుండి రెండు పద్యములు

         "తే|| స్నానమొల్లఁడు దేవతార్చనము సేయఁ
               డమల విజ్ఞాన సంపన్నుఁ డైనయోగి
               లోకులకు తెలియునె వానిలోని గుట్టు?
               నవ్యతర భోగి శ్రీ సదానందయోగి!" (24)

               “బ్రాహ్మల మటంచు కొందఱు పలుకుటెట్లు ?
                బ్రహ్మనెఱుగంగ నేరక బ్రాహ్మఁడగునె?
                బ్రహ్మ నెఱిఁగిన వాఁడెపో బ్రాహ్మణుండు, నవ్యతర..."(66)