పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన వంటివారు 105

వారే దానికి వ్యాఖ్య, దానికి తాత్పర్యమును వ్రాయవలసివచ్చెను. ఇట్లు వ్యాఖ్యతో నాంద్రీకరణమును దానితో మూలమును అర్ధముచేసికొనువఱకును నిలిచియుండఁ గల కవిత్వమును రచింపఁగల్గినవాఁడు ఈ ప్రపంచమున నింకను బుట్టలేదు. ఇది గాక శ్రీ గరిమళ్ళ సత్యనారాయణగారు తెనిఁగించిరcట కాని యింకను నది వ్రాఁత లోనే యున్నట్లున్నది.*[1] దీని చక్కని యాంద్రీకరణ మొకటి తెలుఁగు భాషకు త్వరలో తెచ్చుకొనుభారము మనపై నున్నది. ఆదియట్లుండె,

సామాన్యములగు నీతులవిషయమునఁ దప్ప వేమన్నకు నితనికిని పోలికలు చాలలేవు. అతఁడు దుర్నీతి నెక్కువగా ఖండించినవాఁడు; ఇతఁడు నీతియిట్టి దని చెప్పినవాఁడు; అతనిది విర క్తి ; ఇతనిది రక్తి. అట్లుగాక వేమన్న అన్వయ మార్గమునఁ జెప్పిన నితనివలెనే చెప్పును. కాని యాపోలిక యిరువురు మనుష్యు లకు మనుష్యత్వమును బట్టి పోలిక యున్నట్లు. అపకారము చేసిన వానికిని ఉపకారము చేయుటయే మంచిది. ఇంటికివచ్చిన యతిథి నాదరింపవలయును; అసత్యములాడరాదు-ఇత్యాది విషయములలో ఏ నీతి శాస్త్రకారుఁడును వేఱు విధముగాఁ జెప్పఁడు. కావున ఇట్టి వానిలో నీయిరువురను పోల్చి చూచుటకంటె తిరువళ్ళువరునుండి రెండు పద్యములు యథాశ_క్తి తెనిఁగించి చెప్పి యీతని విషయము చాలింతును :

 
                                             నిష్కల్మషత్వము
                    "మనసునిల్పుకొనుండు మసిలేక, ధర్మ మన
                     మననిదె ; యొుండెల్ల నాడంబరంబు"
                                                  (అఱత్తుప్పాల్, అఱస్ వలియురుత్తల్, ప. 3)
                                                ఆతిథ్యము
                   "అతిథులకుఁ బెట్టి మిగిలినదారగించు
                     నరునిపొలమున విత్తులు నాటవలెనే ?"
                                                  (అఱత్తుప్పాల్, నిరుందోంబల్, ప, 5)
                                                  శాంతి
                   "ఓర్వవలయు నెప్పుడొరులతప్పలు ; వాని
                     మఱచుటింతకంటె మంచిగుణము"
                                                  (అఱ. పొరైయుడైమై, ప. 2)
                                               స్త్రీ వర్ణనము
                    "కనియు వినియు మూరుకొనియును తా(కియు
                      తినియు నెఱుఁగఁదగిన తీపులెల్ల
                      బెరసి నిలిచినవిర ! మెఱుఁగు గాజులతోడి
                      తళుకులాఁడి దీని తనువనందు?
                                                  (కామత్తుప్పాల్, పుణర్చి మహిళ్లల్, ప. 1)

  1. * Vide, “Maxims of Thiruvolluvar” by V. V. S. Iyer, Preface XX. తిరువళ్ళువరును గూర్చిన యనేక విషయములిందుండియే గ్రహించితిని.