పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 104

భావములందును అతనియు ద్రేక మితనికి లేదు. మార్దవము, ఓర్పు, నెమ్మది యిందుఁ గానవచ్చును. కావుననే వేమన పద్యములవలె నొకమాఱు విన్నంతనే యిది బాణమువలె నెదలోఁ దూకదు. సూత్రమువలె పలుమాఱు మననము చేయ వలయును. హిందూదేశమందలి యన్ని ధర్మశాస్త్ర గ్రంథములందును గానవచ్చు అహింస, సత్యము, వైరాగ్యము, శాంతి, దాంతి, ఆతిథ్యము, రాజధర్మములు మొదలగువానినిగూర్చి యందఱును ఆదరింపఁదగిన సామాన్యనీతుల నితఁడు. వ్రాసెనేకాని యిందు క్రొత్తదేమియులేదు. కాని వాని నితఁడు సంగ్రహించి, సారించి, ఏర్పఱిచి చిత్రకారుఁడు బొమ్మనుచేసినట్లు, నలుప్రక్కలు నిదానముగాఁ బరీక్షించి, ఎక్కువతక్కువలు దిద్ది, తీర్చి నెమ్మదిగా కవిత్వపు మొఱుఁగులిచ్చి, పరిపూర్ణముగా బైటఁబెట్టినవాఁడు. కాని, ప్రాచీనులందఱి వలె పై విషయములను మితిమీఱి చీలికలుగా విభజింపఁ బూనుటచేతను, ప్రతివిషయము మీదcను పది పద్యములు తప్పక వ్రాయవలయునను నియమముచేతను, అందందు కవితాశిల్పము పలుచనై చప్పిడియైనట్లు కానవచ్చును.

వేమన్న విరక్తకవి. ఇతఁడు సంసారికవి. కావుననే యతఁడు చిన్న బిడ్డలు *మురికిముద్దలని 'ముద్ధఁ జంకబెట్టి ముద్దాడనేలరా ? (వే.జ్ఞా, 1112) యని యసహ్యపడి మొగ మావలCద్రిప్పకొనఁగా, ఇతఁడు—

              "చిన్న బిడ్డలు చిఱుఁగేలఁ జెఱచినట్టి
               బోన మమృతంబు కంటె నింపానుగాదె?" (స్వాంద్రీకృతము)
                                                      (కురళ్, అరత్తుప్పాల్, పుదల్వరైప్పెరుదల్ 4)

అనెను. వేమన స్త్రీవ్యక్తిని తిరస్కరించి విధిలేక దానికి లోఁగినట్లు తోఁచును; తిరువళ్ళువరు స్త్రీయెడ చాలగౌరవముతో అభిమానముతోఁ గూడినవాcడు. *తమకు ప్రియలైనవారి కౌగిలికంటె తామరకంటి దేవుని లోకమందును ఏమి సుఖము గలదు?" అని యితని ప్రశ్న (కురల్, కామత్తుప్పాల్, పుణర్చి మహిళ్లల్ 3). ఈ కారణముచేతనే యితనిని తిరన్కరించిన వారెవరును లేకపోవుట యట్లుండఁగా ననేకులు పండితులు దీనిని పొగడి వ్యాఖ్యానములు వ్రాసిరి. ఇది ప్రమాణగ్రంథ మయ్యెను. ఉత్తర వేదమని, దైవనూలని దీనికి పేళ్ళు గలిగెను. సుమతిశతకపు కర్తయైనను 'శ్రీరాముని దయచేతను" అని యుపక్రమించుటచేత, శ్రీరామ ద్వేషులెవరైన దానిని దిరస్కరింపవచ్చునుగాని, యితఁడు, 'నామలింగాను శాసనము' వ్రాసిన యమరునివలె, ఏ దేవతను పేరుతోఁ బిలువక, "ఆదిభగవంతునికి' నమస్కరించి గ్రంథముపక్రమించి, అందు ఏ మత పక్షపాతమును జూపక, సర్వ మత సాధారణములగు శాశ్వత నీతులను గూర్చి మాత్రము వ్రాయుటచేత, అందుఱికిని కావలసిన వాఁడయ్యెను. కావననే యోగ్రంథము 150 ఏండ్లకు ముందే 'లాటిను" భాషలోనికిని, తరువాత, జర్మన్, ఫ్రెంచి, ఇంగ్లీషు భాషలలోనికిని పాశ్చాత్త్యులు పరివర్తించుకొనిరఁట. *[1] నేఁటికి నలువదేండ్లకు వెనుకనే "త్రివర్ల దీపిక" యను పేరుతో కనుపర్తి వెంకటరామ శ్రీవిద్యానందులను వారు దీనిని తెలుఁగులో మొదటి రెండు ధర్మార్ధకాండములు పరివర్తించి ప్రకటించిరి. ఆంధ్రులు దాని నెక్కువ గమనించినట్లు కానరాలేదు. నహజమే. ఎందుకనఁగా, ఆంధ్రీకరించినవారికే యది యితరులకర్థము కాదని గట్టినమ్మకము కలుగుటచే,

  1. * See V. V. S. Iyer's Preface, LXIII.