పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన వంటివారు 99

వడుగుజందెములేవియులేని తల్లి భార్య మొదలగువారితో కలిసి వర్తించినను, అట్టి శూద్రులను దాఁకక వారికన్న తానెక్కువయను బ్రాహ్మణుని దేటి బ్రాహ్మణత్వ మని యడిగెను (827). వారిని నమ్మి యెవరు బ్రతికినారని యతనివలె నితఁడును ఆక్రో శించెను! (904) కాని నీతి నెఱిగిన బ్రాహ్మణుఁడు లోకమునకు జ్యోతివంటి వాఁడని నిర్వంచనగాఁజెప్పెను (888). కావున జన్మసిద్ధములైన యెచ్చుదక్కువలు దబ్బర 'ఒక భూమిపై నడిచి, ఒక నీటినే త్రాగి ఒక యగ్నిలోనందఱు మండి పోవుచుండఁగా, నడుమ కులగోత్రము లెక్కడివి?" (879) కావున “స్వర్గది హెూలె గేరి యిల్ల' (863) “దేవరలి కులభేదవిల్ల? (864) : స్వర్గమున మాలవాడ లేదనియు, దేవునికి కులభేదము లేదనియు, ఖండితముగా ఇక జెప్పెను.

ఇఁక నాదేవుఁ డెట్టివాఁడు ? అతఁడు జగమునకెల్ల నొకఁడే ప్రభువు (150). అతఁడు శివుఁడు. నిరాకారుఁడు (95); సర్వవ్యాపి; పాలలో నేయివలె, నీటిలో నగ్నివలె అన్నిటియందును గలఁడు (275). నీవున్న చోటనే నీలోనే కలఁడు (276). ఆదెట్లు సాధ్యమని యెవరైన ప్రశ్నించిరేని---

             “నణ్ణనెయ మళలొళగె నుణ్ణనెయ శిలెయొళగె
              బణ్ణెసి బరెద పఠదొళగె, ఇరువాత
              తన్నల్లి యిరనె సర్వజ్ఞ? (280)

“సన్నని యిసుకలో, నున్నని రాతిలో, వన్నెల పటములలో ఉండగలవాఁడు, నీలో నాలో నుండలేఁడా ?" యని యితఁడు ప్రతి ప్రశ్న వేయుచున్నాఁడు. యోగ సమాధిలో నిలిచి, ఆన్ని భేదములను మఱచి, తానే తానైయున్న, నందే బ్రహ్మ సాక్షా త్కరించును (282). జీవులకే ఆజ్ఞానరూపమగు మాయ కలదు గాని యతనికి లేదు (287). తన్ను తానెఱిఁన నా మాయ నశించును (306).

ఇట్లు జీవబ్రహ్మలకు భేదమే యితని యనుభవమునకు వచ్చినదిగాని, వేమనకువలె పరిపూర్ణాద్వైతానుభవము కలిగినట్లు తోపఁదు. శివపక్షపాతము మొదలు గలిగినను కడపట “ముగ్గురికందని మూలమూర్తి యొకండు? (3103) యని చెప్పి “తన్ను తానెఱి(గిన తానెపో బ్రహ్మంబు? (1787) అన్న వేమనవలె నిశ్చ యముగా నితఁడు చెప్పలేఁడయ్యెను. అతనివలె ఆతృప్తితో ముందుమందింకను జూడవలెనను నాశ లేక, కొంతవఱకు దొరికినదానికి సంతోషించు స్వభావము గలవాఁ డగుటయే యిందుకు కారణమని తలంచుచున్నాను. పరమఫలమైన యద్వైతావస్థ లభింపకున్నను, హఠరాజయోగముల యభ్యాసముచే నితనికి వేమన్నకుఁ గలిగిన తక్కిన ఫలము లన్నియు-సర్వసమత, బహిరంగద్వేషము మొదలగునవిలభించినవి. మఱియు, బ్రహ్మాద్వైతమును సాధింపవలయునని యితఁడు ప్రయత్నింపనేలేదని చెప్పవచ్చును

          "అద్వైత కోడాడి యిద్దుదను హెూగాడి
           ఉద్దన మరద తుదిగేరి, క్రెజారి
           బిద్దు నత్తంతె నర్వజ్ఞ." (285)

"అద్వైతమునకై తిరిగి యున్నది పోగొట్టుకొనుట, పొడువైన మ్రాని తుద కెక్కి చేయిజారి పడి చచ్చినట్లు" అని యనుకొన్న వాఁడితఁడు. కాని యితనికి జీవా ద్వైతము-అనగా, ప్రాణులందఱు నొకటేయనుట-సిద్ధించినది. “తానద్వైత మైన పిదప ఎవరితో కలహింపవలెను? బుద్ధిలో తన్నెఱిఁగిన వానికి లోకపు జగడ ములు లేవు? (337) కావున నిజమైన యోగి వేషము, తిండి మొదలగు వానిఁ