పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన యోగసిద్ధి-మత ప్రచారము 83

నా యింద్రియముల నంతర్ముఖముగాఁజేసి మనస్సులోఁ గలిపి చూచిన, ఇన్నిటికిని కారణమయిన జీవుఁడొక్కఁడే నిత్యమనియు తక్కినవన్నియు అనిత్యమనియుఁ దెలియును. ఆ జ్ఞానము గలిగిన తరువాత కన్నులు విచ్చి చూచినను ఆ జీవుఁడొక్కఁడే ఈ ప్రపంచమందలి చరాచర వస్తువులందెల్ల నంతర్యామిగా నున్నాఁడని తెలియును. అతఁడు లేనిదేదియు నిలువదు. కావున నదియే బ్రహ్మము. అనఁగా, తానే బ్రహ్మము. కావున నీ బహిః ప్రపంచమందొకరి యొక్కువయు నింకొక్కరి తక్కువయు లేదు. జాత్యాది భేదమున కర్థములేదు. వ్యావహారికమైన గౌరవము నకు కారణ మీజ్ఞానము. ఇది లేని వారందఅు నొక్కటే. కావుననే మైల, యెంగిలి మొదలగునవి యెల్ల వట్టి భ్రాంతులు.

ఎప్పడీ విషయములు ఇతని మనస్సుకు తట్టెనో, వాని నప్పడే తానాచరించి, మీరుసు అట్లుచేయుఁడని యితరులకు బోధింప మొదలు పెట్టెను. ఇదివఱకును నే నుదాహరించిన పద్యములవలన వేమన యందలి సృష్టిసిద్ధమైన స్వభావ మొకటి మీకు స్పష్టమై యుండును. అదేదనఁగా, ఉద్రేకము. ఇతఁడు చెడిన చేట్లకును, పడినపాట్లకును, సాధించిన సాధనలకును, అదేమూలము. మనసులోఁ దోcచినది నోటఁజెప్పటకును చేతఁజేయుటకును భేదమట్లుండఁగా, అసలంతరమే యుండదు. యమ నియమాది యోగసాధనలచే ఇతని కన్నియు సిద్ధించి యుండును గాని, శాంతి మాత్ర మొక్కువ సిద్ధింప లేదని చెప్పవలసియున్నది. తన కిష్టము కాని పనులు చేయు వారిని, తన మాటలను విననివారిని జూచి, వారి యజ్ఞానమున *కయ్యోపాప' మనుటకు బదులు ఇతని కసహ్యము జనించును. ఆ యసహ్యము మనసులో నుండక నోటినుండియు నసహ్యముగానే పలుమాఱు వెడలును! అట్టి సందర్భములలో తా నాడు మాటలలో యుక్తియున్నదా,లేదా యనికూడ విచారింపఁడు. చూడుఁడు.

ఎప్పడును యోగానందమందుండ నేర్చినవారికి బహిరంగములగు వేషము మొదలగువానిపై నంత యక్కరయుండదు. వస్త్రములు శుభ్రముగా నుంచుకొనుట, అందుకై చాకలివానితో కలహించుట మొదలగు పనులకు కాలమును ఉండదు. కావున సట్టివారు చినిఁగిన ముఱికిబట్టలతోనే కాలముఁ గడపవచ్చును. కొందరదియు వలదని 'కౌపీనపంతః ఖలు భాగ్యవంతః" అని యనుకొని యట్లందురు. వేమన గూడ తొలుత కొన్నా ళ్ళు *గోచిపాతకంటె కొంచెంబు మఱిలేదు” (450) అని యనుకొన్నను, తరువాత ఇంకను దూరముపోయి సాక్షాత్పరమశివ సారూప్యమును బొందినాఁడు. ఇట్టి సుదర్భమున ఇతని నెవరో 'కోత్యాటలాడించి వెఱ్ఱియనుచు నూరు వెడలగొట్టిరి" (1335). ఆప్పడు దానికతఁడిచ్చిన అసహ్య ప్రత్యుత్తర మట్లుండనిండు. ఈ తర్క యుక్తి వినుఁడు

 
               "ఆ. తల్లిగర్భమందు తాఁ బుట్టినప్పడు
                     మొదలు బట్టలేదు తుదను లేదు,
                     నడుమ బట్టఁగట్ట నగుఁబాటుగాదొకో.." (1845)

కాని, యీ యోగవిద్య, ఈ కవిత్వము-తల్లిగర్భమునఁ బుట్టినపడే వేమన్నకు వచ్చినవా ? ఏమియుక్తి ! కాని యీ వైరాగ్యము ముదురుటకు ముందు వేమన ఈ బహిరంగ శుద్ధిగూడ మంచిదనియే తల(చెను.

 
               "ఆ. మాసిన తలతోడ, మలినవస్త్రముతోడ
                     ఒడలి జిడ్డుతోడ నుండెనేని,
                     అగ్రజనమునైన నట్టె పొమ్మందురు.” (3081)