పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 82

మైనదనియుఁ జెప్పెను.* [1]నా కాధైర్యము లేదు. నాకింతమాత్రము నమ్మికగలదు : వేమన్న తాను తత్త్వజ్ఞఁడైతినని ధృడముగా నమ్మెననుటలో నందేహములేదు.

ఇట్లు ఇతఁడు ఈ సంసారుల ప్రపంచమునందలి దంభవంచనాదులకు రోసి, అందేమో శ్వేతద్వీపము గలదనుకొని బైరాగుల ప్రపంచమునఁ బ్రవేశించెను. కాని, పాపము, మనుష్యులయోగ్యత యెందుస్నను ఒకటే యనుతత్త్వమును అతఁడచ్చట నేర్చుకొనవలసి వచ్చెను. ఎందఱో యోగిబ్రువులు తాము సిద్దులమని, మాంత్రికుల మని, విరక్తులమని, తత్త్వజ్ఞులమని, వేషములు వేసి ప్రపంచమును ప్రతారణ చేయుచుండిరి, 'సర్వోపాయ పరిభ్రష్టావేశ్యాభవతి తాపసీ' †[2]యనునట్లు ఇంకెందును జీవనము జరుగనివారి కీ యోగివేషము కల్పవృక్షమువంటి దాయెను. తక్కిన విద్యల లోగుట్టును ఇతరులు చాలవరకు నెఱుఁగఁగలరు. కాని ఈ *యోగుల' కసరత్తులు, బహిరంగోపాసనములు, సమాధులు మొదలగు వానికి మోసపోనివా రరుదు. ఇట్టి వారిప్పటికిని మన సంఘమం దందు సంచరించి, చదువుకొన్నవారినే లోపఱిచికొని, సంసారములు ధ్వంసముచేయుచున్నారనుట మీరెఱుఁగుదురు'

 
               "ఆ. బ్రతుకుదెరువు లేని బడుగులందఱు పెద్ద
                     యోగివరులమనుచు సాcగిరాcగ
                     బండవాండ్రు ముందు దండంబు లిడుదురు..." (2773)

కడపటికిన్నాళ్ళు భోగమునందును యోగమునందును కష్టపడి యతఁడు నేర్చుకొన్న ముఖ్యవిషయములివి :

సంసారము సారములేనిది. దుఃఖమయము ; మాయారూపము; (ఈ 'మాయ' శబ్దమున కితనికి నిజమైన యర్థమేమో తెలిసికొను మార్గములేదు). ఈమాయ సంసారము మనసులోనే పట్టినది. దీనిని దప్పించుకొనుట ప్రధానపురుషార్థము దానికి కర్మములు పనికిరావు. ఉపవాసములు, విగ్రహారాధనలు మొదలగువానిచే ఆ మాయ తెగదు. కాcబట్టి 'కర్మగుణములెల్ల కడఁబెట్టి నడవమి, తత్త్వమెట్లు తన్నుదగులుకొనును?" (944) అని యితని ప్రశ్న. ఆ తత్త్వము నెఱుఁగుటకు మమతలు విడిచి మనస్సునిలిపి ధ్యానించుట చాలును. తక్కిన సాధనములక్కర లేదు. దీనికై యడవులకు కొండలకు పోఁబనిలేదు. పల్లెలలో ఇండ్లలోనుండియే చేయవచ్చును. కాని పట్టణములందుండకపోవుట మేలు. ఎందుకనఁగా :

 
              "ఆ. పట్టణంబులందు పతులకు సతులకు
                    మోహమెచ్చు దానియూహలెచ్చు
                    ముక్తిమార్గమునకు యుక్తియే తెలియదు..." (2384)

కనుక ఆ మోహమును వదలించు బ్రహ్మచర్యము ముఖ్యముగా సాధింప వలయును. కామాతురత్వము నిలుపుటకు అందలిరోఁత, దానివలని దుష్పలములును ఎఱింగి క్రమముగా స్వాధీనపఱుచుకొనవలసినదే కాని కృత్రిమములగు హఠవిద్యల చేతఁగాదు. ‘పేని గడ్డిగట్ట నేనుఁగు నిలుచునా? (943) యని యితఁడడుగు చున్నాఁడు. ఇది స్వాధీనమైనచో తక్కిన సాంసారికదుఃఖ హేతువులైన క్రోధ లోభాదులు వెంటనే నశించును. పంచేంద్రియములు పంచభూతములందు సంచ రించుచున్నన్ని నాళ్ళను ఈ జగత్తు ఉన్నట్లు కానవచ్చును (2335). కావున

-

  1. * See Brown’s Vemana, Preface, p. II.
  2. † అన్నియుపాయములును పనికిరాకపోయివ వేశ్య తాపసియగును ఆని తాత్పర్యము.