పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 80

             "క, బయలన సర్వముఁ బుట్టును,
                  బయలందే లీనమగును, బ్రహ్మంటనఁగా
                  బయలని మదిలోఁ దెలిసిన
                  బయలందే ముక్తి బట్టబయలగు వేమా" (2696)

మఱియు నాబ్రహ్మము తానే తప్ప వేఱుగాదని తేల్చుకొనెను. *తన్నుఁదా నెఱిగిన(దానెపో బ్రహ్మంబు' (2788) కావున "ఏవిధమున మనుజుఁ డెఱుఁగు నిన్నును దన్ను?' అని వెనుక వేసిన ప్రశ్నకిప్పడు ప్రత్యుత్తరము లభించినది

            "ఆ. నిన్నుఁ జూచుచుండ నిండును తత్త్వంబు,
                  తన్నుఁ జూచుచుండఁ దగులు మాయ ;
                  నిన్ను నెఱి(గినపుడె తన్ను తానెఱుఁగును..." (2239)

తాను బ్రహ్మమైనపుడు తక్కినవన్నియు నేమి తప్పుచేసినవి ? కావున సమస్తమును బ్రహ్మమే. "బ్రహ్మమన్నిటఁ దగుఁ బరిపూర్ణమైయెప్పు' (2796) 

ఇట్లు రాజయోగపరమావధియైన యద్వైతానుభవమును సాధించిన వెంటనే, ఆసనములు, ప్రాణాయామము మొదలగు హఠవిద్యల నితఁడు తిరస్కరించెను.

           "ఆ. ఏఱుదాఁటి మెట్టకేఁగిన పురుషుడు
                 పుట్టి నరకుఁ గొనక పోయినట్లు..." (760)

అని యితఁడే వేరొక విషయమై చెప్పిన న్యాయమువంటిదే కదా ! చూడుఁడు :

           "ఆ. ఆసనములు పన్ని అంగంబు బిగియించి
                 యొడలు విఱుచుకొనెడు యోగ మెల్ల
                 జెట్టిసాముకన్న చింతాకు తక్కువ." (337)
           "ఆ. కల్లగురుఁడు గట్టు నెల్లకర్మంబులు
                 మధ్యగురుఁడు గట్టు మంత్రచయము
                 ఉత్తముండు గట్టు యోగసామ్రాజ్యంబు..." (963)

కాని నాకొకటి తోచుచున్నది హఠమార్గము చాలకష్టమైనది. దానిని సాధింపఁగల యోర్పును సామర్థ్యమును గలవారరుదు. అనేకులిందలి సిద్ధుల కాసపడి యంతటితో చాలించుకొనుట సత్యము. అట్లు గాక రాజయోగమును సాధించి ఆత్మజ్ఞానమును సంపాదించుటకే దృఢచిత్తముతో హఠమును సాధించుచు కష్టపడువానిని జూచి కరుణదించి సమర్థ(డగు గురువు, స్వశక్తితో నొకనిమిషమందు శిష్యునికి అసంప్రజ్ఞాతసమాధినిగల్గించి బ్రహ్మసాక్షాత్కారముఁ జేయింపఁగలఁడఁట ! *సద్గురునాథ ప్రసాదంబున క్షణమున రాజయోగమున మనసు నాశమౌ తోడనె నాశమౌ గాలియు) (శివ. 4. ఆ.) దీనినే తాంత్రికులు *వేధదీక్ష' యందురు. శిష్యుని దేహమందలి షట్చక్రస్థానములనెఱిఁగి, మంత్రబీజాక్షరన్యాసముచేసి, మోకాళ్ళు మొదలు నాభి, హృదయము, కంఠము, దవడవఱకును గురువు' వేధింప' వలయునఁట. తోడనే శిష్యుడు పాపములన్నియు నశించి, బహిరంగ వ్యాపారము లన్నియు నిలిచి క్రిందఁబడునఁట. ఆతనికప్పడు దివ్యత్వముగలిగి సర్వము నెఱుఁగఁగలఁడఁట, కాని యట్టి సామర్థ్యముగల గురుశిష్యులిరువరును దొరకుట దుర్లభమఁట !*[1] వేమనకుఁగూడ హఠయోగమవలస వేసరియుండిన వేళలో

  1. * చూ. కులార్ణవతంత్రము, 14 వ ఉల్లాసము.